తుప్పుపట్టిన నాణేలు.. కరిగించేందుకు టీటీడీ తరలింపు

తిరుమల తిరుపతి దేవస్థానంలో గుట్టలు గుట్టలుగా నాణేలు పేరుకుపోయాయి. ముఖ్యంగా చలామణిలో లేని నాణేలపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో స్టీల్, అల్యూమినియం, నికిల్, కాపర్, ఇత్తడి వంటి లోహాలతో తయారైన రకరకాల నాణేలు ఉన్నాయి. 84 టన్నుల నాణేలను స్టీల్ కింద కరిగించేందుకు సేలంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తరలించింది టీటీడీ. 2014 నుంచి టీటీడీ ట్రెజరీలో నాణేలు పేరుకుపోయాయి. అణా నుంచి ఒక పైసా, రెండు, ఐదు, పది, 25 పైసల నాణేలను […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:43 pm, Tue, 28 January 20
తుప్పుపట్టిన నాణేలు.. కరిగించేందుకు టీటీడీ తరలింపు

తిరుమల తిరుపతి దేవస్థానంలో గుట్టలు గుట్టలుగా నాణేలు పేరుకుపోయాయి. ముఖ్యంగా చలామణిలో లేని నాణేలపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో స్టీల్, అల్యూమినియం, నికిల్, కాపర్, ఇత్తడి వంటి లోహాలతో తయారైన రకరకాల నాణేలు ఉన్నాయి. 84 టన్నుల నాణేలను స్టీల్ కింద కరిగించేందుకు సేలంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తరలించింది టీటీడీ. 2014 నుంచి టీటీడీ ట్రెజరీలో నాణేలు పేరుకుపోయాయి. అణా నుంచి ఒక పైసా, రెండు, ఐదు, పది, 25 పైసల నాణేలను స్టీల్ కర్మాగారానికి టీటీడీ తరలించింది. దాదాపు టన్నుకు రూ. 30 వేల చొప్పున టీటీడీకి సేలం చెల్లించనుంది. ఈ నాణేలను తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అంగీకరించక పోవడంతో.. ఇక వీటిని కరిగించే ప్రయత్నంలో పడింది టీటీడీ. తొలివిడతలో భాగంగా 40 టన్నుల నాణేలను తరలించింది.