టీటీడీ ఆస్తులను విక్రయించం : ఈవో

శ్రీవారి ఆస్తులను ఇకపై విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఏపీ హైకోర్టుకు నివేదించారు.

టీటీడీ ఆస్తులను విక్రయించం : ఈవో
Follow us

|

Updated on: Aug 18, 2020 | 5:16 PM

శ్రీవారి ఆస్తులను ఇకపై విక్రయించకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఏపీ హైకోర్టుకు నివేదించారు. తమిళనాడులోని 23 ఆస్తుల్ని విక్రయించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆ వేలాన్ని అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ బీజేపీ నేత అమర్ నాథ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సమగ్ర నివేదిక సమర్పించాలని టీటీడీ పాలక మండలిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. గత మే 28న టీటీడీ తీర్మానం చేసిందని, 1974 నుంచి విక్రయించిన ఆస్తుల వివరాలపై శ్వేతపత్రం ప్రచురించాలని కూడా నిర్ణయించామని పేర్కొన్నారు. ఆస్తుల సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు. టీటీడీకి చెందిన 50 ఆస్తులను విక్రయించేందుకు అనువుగా 2016 జనవరిలో చేసిన తీర్మానాన్ని పక్కన పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం గత మే 25న జీవో జారీ చేసిందన్నారు.

భక్తులు ఇచ్చిన ఆస్తులను స్వీకరించాక, వాటిపై తగిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ టీటీడీకి ఉందని ఈవో హైకోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు సింఘాల్‌ హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. టీటీడీ ఆస్తుల్ని విక్రయించడాన్ని సవాల్ చేస్తూ అమర్ నాథ్‌ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మరోమారు విచారణ జరిపింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..