కేసీఆర్ ఆదేశం.. చిరు, నాగ్‌లతో.. మంత్రి తలసాని భేటీ!

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో అక్కినేని నాగార్జునతోపాటు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్ డీసీ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం వీరి భేటీపై అటు సినీ వర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లోనూ ఆద్యంతం ఆసక్తి నెలకొంది. కేవలం ఈ ఇద్దరు హీరోలు మాత్రమే.. ఆయనతో భేటీ కావడం నిజంగానే ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందకంటే.. రాజకీయ విషయానికొచ్చేసరికి వీరు వివిధ పార్టీలకు చెందిన వారు. అందులోనూ ఈ మధ్య చిరంజీవి.. […]

కేసీఆర్ ఆదేశం.. చిరు, నాగ్‌లతో.. మంత్రి తలసాని భేటీ!

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో అక్కినేని నాగార్జునతోపాటు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్ డీసీ ఛైర్మన్ రాంమోహన్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం వీరి భేటీపై అటు సినీ వర్గాల్లోనూ.. రాజకీయ వర్గాల్లోనూ ఆద్యంతం ఆసక్తి నెలకొంది. కేవలం ఈ ఇద్దరు హీరోలు మాత్రమే.. ఆయనతో భేటీ కావడం నిజంగానే ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందకంటే.. రాజకీయ విషయానికొచ్చేసరికి వీరు వివిధ పార్టీలకు చెందిన వారు. అందులోనూ ఈ మధ్య చిరంజీవి.. ఏపీ సీఎం జగన్‌తో పాటు.. ఇటు కేసీఆర్‌తో కూడా సన్నిహితంగా ఉంటున్నారు.

అయితే.. ప్రస్తుతం వీరి భేటీ.. కేవలం సినీ ఇండస్ట్రీకి సంబధించినది మాత్రమేనని.. వారు క్లారిటీ ఇచ్చేశారు. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్, షూటింగ్ పర్మిషన్లు సహా లోకేషన్లలో మహిళల భద్రతపై వీరు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. గత రెండు రోజుల నుంచి పలువురు సినీ పెద్దల నుంచి ప్రధాన సమస్యలను గుర్తించిన ప్రభుత్వం.. వాటి పరిష్కారానికి ముందడుగు వేయబోతుంది. అలాగే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా.. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సహాయమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమంటూ మంత్రి తలసాని పేర్కొన్నట్లు సమాచారం.

Published On - 5:24 pm, Tue, 4 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu