వైసీపీ నేత పీవీపీకి హైకోర్టులో ఊరట..

వైసీపీ నేత, మూవీ ప్రొడ్యూస‌ర్ పొట్లూరి వరప్రసాద్​కు తెలంగాణ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. పీవీపీ ముందస్తు బెయిల్​పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

వైసీపీ నేత పీవీపీకి హైకోర్టులో ఊరట..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 2:54 PM

వైసీపీ నేత, మూవీ ప్రొడ్యూస‌ర్ పొట్లూరి వరప్రసాద్​కు తెలంగాణ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. పీవీపీ ముందస్తు బెయిల్​పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

విల్లా గొడవకు సంబంధించి పీవీపీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పొట్లూరి వరప్రసాద్​కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించి.. ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాల‌ని కోరారు. దీంతో తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసుల‌పై పీవీపీ.. కుక్కుల‌ను వ‌ద‌ల‌డం క‌ల‌క‌లం రేపింది. దీనికి సంబంధించి కూడా ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.