తొలిసారిగా ఫేస్‌మాస్క్‌తో డొనాల్డ్ ట్రంప్..

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి ఫేస్‌మాస్క్‌తో దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రంప్‌ ఫేస్‌మాస్క్‌తో ఎన్నడూ కనిపించలేదు. పైగా ఫేస్‌మాస్క్

  • Publish Date - 5:54 am, Sun, 12 July 20 Edited By:
తొలిసారిగా ఫేస్‌మాస్క్‌తో డొనాల్డ్ ట్రంప్..

యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి ఫేస్‌మాస్క్‌తో దర్శనమిచ్చారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రంప్‌ ఫేస్‌మాస్క్‌తో ఎన్నడూ కనిపించలేదు. పైగా ఫేస్‌మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటూ ఆయన అనేక సందర్బాల్లో చెప్పుకొచ్చారు. ఫేస్‌మాస్క్ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని ఆయన అంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన ఫేస్‌మాస్క్‌తో కనిపించడంతో రిపబ్లికన్ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. నో-మాస్క్ సిద్ధాంతాన్ని అనుసరించే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మేరీల్యాండ్‌లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరి మెడికల్ సెంటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫేస్‌మాస్క్ ధరించాల్సి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లే సమయంలో ఫేస్‌మాస్క్ తప్పనిసరిగా ధరించాలని.. అది తనకు ఏ మాత్రం కష్టమైన పని కాదంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 33 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి లక్షా 36 వేల మందికి పైగా మరణించారు.

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..