Trump Twitter: ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను లాక్‌ చేసిన యాజమాన్యం.. అదే బాటలో ఫేస్‌బుక్‌..

Trump Twitter Account Locked: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినప్పటి నుంచి దేశంలో పరిణామాలు రోజుకో మలుపుతీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా...

Trump Twitter: ట్రంప్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ను లాక్‌ చేసిన యాజమాన్యం.. అదే బాటలో ఫేస్‌బుక్‌..
Follow us

|

Updated on: Jan 07, 2021 | 8:45 AM

Trump Twitter Account Locked: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినప్పటి నుంచి దేశంలో పరిణామాలు రోజుకో మలుపుతీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ గెలుపును ధృవీకరించేందుకు తాజాగా యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. ఈ సమయంలో అమెరికా క్యాపిటల్‌ భవనంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రంప్‌ మద్దతు దారులు క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకు రావడంతో బైడెన్‌ ధృవీకరణకు ఆటంకం ఏర్పడింది.

ఇదిలా ఉంటే ఈ సమయంలో ట్రంప్‌ చేసిన కొన్ని ట్వీట్లు తీవ్ర చర్చకు దారి తీశాయి. దీంతో ట్విట్టర్‌ యాజమాన్యం ఆయన అకౌంట్‌ను లాక్‌ చేసింది. తమ నియమాలకు విరుద్ధంగా ట్వీట్ చేశారన్న కారణంగా ట్రంప్‌ ఖాతాను 12 గంటల పాటు లాక్‌ చేశారు. సదరు ట్వీట్లను వెంటనే తొలగించాలని ట్విట్టర్‌ యాజమాన్యం తెలిపింది. ట్వీట్లు తొలగించకపోతే ట్రంప్‌ అకౌంట్‌ను శాశ్వతంగా లాక్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ యాజమాన్యం కూడా ట్రంప్ అకౌంట్‌ను 24 గంటల పాటు లాక్‌ చేస్తూ ప్రకటన చేసింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్‌ ఫేస్‌బుక్‌ వేదికగా చేసిన రెండు పోస్టుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

Also Read: అమెరికాలో కొనసాగుతున్న కరోనా టీకా అత్యవసర వినియోగం.. రోజుకు పది లక్షల మందికి వ్యాక్సినేషన్ః ఫౌచీ