AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: త్వరలోనే హర్మూజ్‌ తెరుచుకుంటుంది.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన!

అమెరికా-ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధంలో విషయంలో అమెరికా, ఇరాన్, ఇతరదేశాల మధ్య దాదాపు చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే అమెరికా-ఇరాన్ యుద్ధం ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. అలాగే వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి కూడా తెరుచుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Donald Trump: త్వరలోనే హర్మూజ్‌ తెరుచుకుంటుంది.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన!
Trump Announces Us Iran Conflict Nearing End
Anand T
|

Updated on: May 24, 2026 | 7:12 AM

Share

గత కొన్ని రోజులుగా జరుగుతున్న అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్నట్టే కనిపిస్తున్నాయి. ఈ చర్చలకు సంబంధించి తాజాగా అమెరికా అధ్యక్షడులు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా, ఇరాన్, ఇతరదేశాల మధ్య దాదాపు చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే అమెరికా-ఇరాన్ యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అలాగే వీలైనంత తర్వగా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రాత్‌పోస్ట్‌ వేదిక ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇదిలా ఉండగా అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయ్ మాట్లాడుతూ.. గత వారంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉన్న విభేదాలు తగ్గుతూ, ఇరుపక్షాలూ ఒకే తాటిపైకి వస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కీలకమైన అంశాలపై ఇప్పటికప్పుడే పూర్తి స్థాయి ఒప్పందాలు కుదిరినట్లు కాదని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా నాయకత్వం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఇదే విషయమై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. శాంతి స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం గురించి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ వంటి దేశాల అగ్రనేతలతో తాను ఫోన్‌లో చాలా సానుకూలమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్, మిగిలిన దేశాల మధ్య ఈ ఒప్పందం దాదాపుగా ఖరారైంది. తుది నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆఖరి అంశాలు, వివరాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వీటిని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం అని ట్రంప్ చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us