డోనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం, రెండో సారి, 10 మంది రిపబ్లికన్లు కూడా !

ఆమెరికా ప్రతినిధుల సభ బుధవారం కొత్త హిస్టరీ సృష్టించింది. అధ్యక్షుడు ట్రంప్ ను అభిశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయనను ఇంపీచ్ చేయడం ఇది రెండోసారి..

డోనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం, రెండో సారి, 10 మంది రిపబ్లికన్లు కూడా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2021 | 9:15 AM

Donald Trump:ఆమెరికా ప్రతినిధుల సభ బుధవారం కొత్త హిస్టరీ సృష్టించింది. అధ్యక్షుడు ట్రంప్ ను అభిశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయనను ఇంపీచ్ చేయడం ఇది రెండోసారి. తొలి అభిశంసన మాదిరి కాకుండా నిన్న సభలో రిపబ్లికన్ల తరఫున మూడో నేత అయిన లిజ్ చెసే అనే ఎంపీతో సహా 10 మంది రిపబ్లికన్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు. తీర్మానానికి మద్దతుగా 232 ఓట్లు, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. లోగడ ఓ అధ్యక్షుని వ్యవహారంలో ప్రతినిధుల సభలో ఇలా ఎన్నడూ జరగలేదు. కాగా రోజంతా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఒక దశలో చెనే రాజీనామాకు కూడా సిధ్దపడ్డారు. మైనారిటీ లీడర్ కెవిన్ మెక్ కార్సీ తో బాటు పలువురు రిపబ్లికన్లు తీర్మానాన్ని ఖండిస్తూ మాట్లాడారు. క్యాపిటల్ హిల్ ఘటనలకు ట్రంప్ ను బాధ్యుడ్ని చేయవచ్చుగానీ, అభిశంసించడం వల్ల ఫలితం లేదని ఆయన అన్నారు. కానీ స్పీకర్ నాన్సీ పెలోసీ మాత్రం తన పట్టు వీడలేదు. క్యాపిటల్ హిల్ ఘటనలకు మాత్రమే కాదు…ఎన్నికలు ఫ్రాడ్ అంటూ లేనిపోని రచ్ఛ చేసినందుకు కూడా ట్రంప్ ను బాధ్యుడ్ని చేయాల్సిందే అని ఆమె అన్నారు. ఆయన పదవి నుంచి దిగిపోవాల్సిందే అన్నారు. ఈ దేశానికి ఆయన డేంజర్ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇక ట్రంప్ పై సెనేట్ లో విచారణ జరగాల్సి ఉంది. ఒక మాజీ అధ్యక్షుడిని సెనేట్ లో విచారించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ నెల 20 న ట్రంప్ పదవీ చ్యుతుడు కావలసి ఉంది. అదే రోజున దేశ నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

Also Read:

జీవకోటి జీవితాల్లో చీకటిని రూపుమాపి వెలుగును ప్రసాదించే శుభతరుణం.. సంక్రాంతి, సాంప్రదాయం ప్రకారం ఈ పర్వదినాన ఏం చేయాలి?

బిహార్‌లో దారుణం.. మూగబాలికపై అఘాయిత్యం.. గుర్తుపట్టకూడదని కళ్లల్లో పొడిచిన దుండగులు..

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. కచ్చితమైన సమాచారంతో నిందితుల కోసం గాలింపు..

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..