విజయం నాదే ! ఫ్రాడ్ పై సుప్రీంకోర్టుకెక్కుతాం, ట్రంప్

అమెరికా ఎన్నికల్లో విజయం తనదేనని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గెలుపునకు తాను కొద్దిదూరంలోనే ఉన్నానని, నిజానికి ఇప్పటికే విజయం సాధించానని అన్నారు. వైట్ హౌస్ లో తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో మాట్లాడిన ఆయన..ఓట్ల లెక్కింపులో మోసం (ఫ్రాడ్) జరిగిందని, దీనిపై తాము సుప్రీంకోర్టుకెళ్తామని చెప్పారు. తమ రిపబ్లికన్లు ఘన విజయాన్ని సెలబ్రేట్ చేయబోతుండగా హఠాత్తుగా ఏదో జరిగిందన్నారు, అమెరికన్లపై ఈ ఫ్రాడ్ జరగనివ్వబోమన్నారు. మేం కోర్టుకెళతాం, ఓటింగ్ ని ఆపాలని కోరుతాం అన్నారు. అంటే […]

విజయం నాదే ! ఫ్రాడ్ పై సుప్రీంకోర్టుకెక్కుతాం, ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 04, 2020 | 3:35 PM

అమెరికా ఎన్నికల్లో విజయం తనదేనని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గెలుపునకు తాను కొద్దిదూరంలోనే ఉన్నానని, నిజానికి ఇప్పటికే విజయం సాధించానని అన్నారు. వైట్ హౌస్ లో తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో మాట్లాడిన ఆయన..ఓట్ల లెక్కింపులో మోసం (ఫ్రాడ్) జరిగిందని, దీనిపై తాము సుప్రీంకోర్టుకెళ్తామని చెప్పారు. తమ రిపబ్లికన్లు ఘన విజయాన్ని సెలబ్రేట్ చేయబోతుండగా హఠాత్తుగా ఏదో జరిగిందన్నారు, అమెరికన్లపై ఈ ఫ్రాడ్ జరగనివ్వబోమన్నారు. మేం కోర్టుకెళతాం, ఓటింగ్ ని ఆపాలని కోరుతాం అన్నారు. అంటే మెయిల్ -ఇన్-ఓట్ల  లెక్కింపును ఆపాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇది కోట్లాది అమెరికన్లకు సిగ్గుచేటన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో తమ రిపబ్లికన్లు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.