ఆమె చేసిన రేప్ ఆరోపణల నుంచి నన్ను తప్పించండి, అప్పీల్స్ కోర్టుకు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన, వైట్ హౌస్ వీడే వేళ

ఆమె చేసిన రేప్ ఆరోపణల నుంచి నన్ను తప్పించండి, అప్పీల్స్ కోర్టుకు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన, వైట్ హౌస్ వీడే వేళ
Donald Trump

వైట్ హౌస్ వీడే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త సమస్య ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈయన తనను రేప్ చేశాడంటూ..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 11:10 AM

వైట్ హౌస్ వీడే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త సమస్య ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఈయన తనను రేప్ చేశాడంటూ జీన్ కేరోల్ అనే కాలమిస్ట్ ట్రంప్ పై దావా వేసింది. న్యూయార్క్ లోని ఓ మీడియా సంస్థలో పని చేసే ఈమె.. ఈ మేరకు ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేసింది. మన్ హటన్ లో 20 ఏళ్ళ క్రితం నిర్మానుష్యమైన చోట ట్రంప్ తనపై దాడి చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అయితే ఈ దావా కేసు నుంచి తనను తప్పించాలని ట్రంప్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును కోరారు. 1988 నాటి వెస్ట్ ఫాల్ చట్టం కింద తనను తప్పించాలని ఆయన అభ్యర్థించాడు. అయితే ఈ చట్టం కింద ఆద్యక్షులను కూడా విచారించవచ్చునని డిస్ట్రిక్ట్ కోర్టు లోగడ రూలింగ్ ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని ట్రంప్ తాజాగా కోరారు. కేరోల్ అబధ్ధాలు చెబుతోందని, డెమొక్రాట్లతో కుమ్మక్కయిందని ఈయన ఆరోపించాడు. దేశాధ్యక్షులు ప్రభుత్వ ఉద్యోగులని, వెస్ట్ ఫాల్ చట్టం కింద వారిని విచారించరాదని ఆయన అంటున్నాడు. మరి రెండు రోజుల్లో పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్ మరి ఈ కేసు నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Also Read:

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా.. పెరిగిన రికవరీ రేటు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

Natkhat Movie: ఆస్కార్ అవార్డు రేసులో విద్యాబాలన్ సినిమా.. 2021 బెస్ట్ షార్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ‘నట్‏ఖట్’..

Bird Flu in Maharashtra: మహారాష్ట్రలో రోజు రోజుకీ వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. తాజగా 983 పక్షులు మృతి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu