ఖమ్మం ముఖ్యనేతలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. పార్టీలో నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపు

ఖమ్మంకు చెందిన తుమ్మల, నామా, పువ్వాడ, పొంగులేటి వంటి ముఖ్య నేతలతో కేటీఆర్‌ చర్చించారు.

  • Balaraju Goud
  • Publish Date - 4:22 pm, Thu, 21 January 21
ఖమ్మం ముఖ్యనేతలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. పార్టీలో నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపు

KTR meet Khammam Leaders : ఖమ్మం జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొద్దిరోజులుగా జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై క్లాస్‌ తీసుకున్నారు. ఖమ్మంకు చెందిన తుమ్మల, నామా, పువ్వాడ, పొంగులేటి వంటి ముఖ్య నేతలతో కేటీఆర్‌ చర్చించారు. కొత్త, పాత అందరినీ కలుపుకోవాలని నేతలకు మంత్రి కేటీఆర్ సూచించారు. పార్టీ నేతల మధ్య సఖ్యత అవసరమన్న మంత్రి.. వర్గ విభేదాలు సృష్టిస్తే ఊరుకునేదిలేదన్నారు.

ఖమ్మంలో నెలకొన్న విభేదాలపై ఇటీవల పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, పార్టీలో ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందన్న మంత్రి.. కొత్త పాత అందరినీ కలుపుకొని పోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు.. పార్టీ బలంగా ఉండడం ముఖ్యమని మంత్రి కేటీఆర్‌ వారికి సూచించారు. పార్టీలో నేతలంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

మంత్రి పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి.. కేవలం ఖమ్మానికే మంత్రి అనుకోవద్దన్నారు. జిల్లాలోని మిగతా నియాజకవర్గాల వారీగా అభివృద్ది పనులను సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్‌కు అందించారు.

Read Also... తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గ్రేట్ న్యూస్… 50% శాతం రాయితీ.. దీపావళి పర్వదినాన వెల్లడించిన మునిసిపల్ మంత్రి