బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాని మీ పార్టీతో మా ఎమ్మెల్యేలు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతోందని మండిపడ్డారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:39 am, Fri, 15 November 19
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాని మీ పార్టీతో మా ఎమ్మెల్యేలు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు నడుపుతోందని మండిపడ్డారు. పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ అభివృద్ధిని నమ్ముకుంటే.. బీజేపీ మాత్రం అరాచకాన్ని నమ్ముకుందంటూ విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ శ్రేణులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు.