బ్రేకింగ్.. కవిత ఘనవిజయం

బ్రేకింగ్.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. అనుకున్న సమయానికంటే అరగంటముందే ఫలితం తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. అధినేత కేసీఆర్ తనయి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆమె ఫలితం వెల్లడి అయింది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు సుభాష్ రెడ్డి, పోతాంకర్ లక్ష్మీనారాయణ డిపాజిట్లు కోల్పోయారు. పోలైన ఓట్లు మొత్తం 823 కాగా.. టీఆర్ఎస్‌కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 […]

  • Venkata Narayana
  • Publish Date - 10:38 am, Mon, 12 October 20
బ్రేకింగ్.. కవిత ఘనవిజయం

బ్రేకింగ్.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం వచ్చేసింది. అనుకున్న సమయానికంటే అరగంటముందే ఫలితం తేలిపోయింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి.. అధినేత కేసీఆర్ తనయి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆమె ఫలితం వెల్లడి అయింది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు సుభాష్ రెడ్డి, పోతాంకర్ లక్ష్మీనారాయణ డిపాజిట్లు కోల్పోయారు. పోలైన ఓట్లు మొత్తం 823 కాగా.. టీఆర్ఎస్‌కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి.. చెల్లని ఓట్లు 10 ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఘన విజయం సిద్ధించింది. ఫలితంగా 14వ తేదీన ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్