గిరిజనులను వణికిస్తున్న మరో భయం..ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్..జల్లెడ పడుతున్న పోలీసులు

ఏఓబీలో ల్యాండ్‌ మైన్స్‌ ఫియర్‌. అడుగడుగునా మందుపాతరలే. భద్రతా బలగాలే వారి టార్గెట్‌. అదమరిచారా ఇక అంతే. పోలీసులకు కీలక సమాచారం అందడంతో అలెర్ట్‌ అయ్యారు. అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను కనుకొనే పనిలో పడ్డారు...

గిరిజనులను వణికిస్తున్న మరో భయం..ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్..జల్లెడ పడుతున్న పోలీసులు
Follow us

|

Updated on: Dec 08, 2020 | 10:44 PM

Landmines set up by Maoists : ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్లు మధ్య నిత్యం వార్‌ జరుగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు వ్యూహా ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతుంటారు. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురుపడినప్పుడు కాల్పులు జరుగుతాయి. చాలా సందర్భాల్లో మావోయిస్టులు చనిపోవడం లేదా.. తప్పించుకుని పారిపోవడమో జరుగుతుంది. కొన్ని సందర్భాల్లోనే భద్రతా బలగాలకు నష్టం కలుగుతుంది. ఒక్కోసారి మావోయిస్టులు స్థానిక గిరిజనుల సాయంతో పోలీసులను టార్గెట్‌ చేసేవారు.

అయితే ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. గిరిజనులకు సమాచారం ఇవ్వకుండా మావోయిస్టులు తమ ప్లాన్‌ అమలు చేస్తున్నారు. ఇటీవల చింతలవీధి అడవుల్లో పేలిన ఓ ల్యాండ్ మైన్‌కు ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి మావోయిస్టులపై స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇటీవల పోలీసులకు లొంగిపోయిన కొంతమంది మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి‌. ఏవోబీలోని 5 గ్రామాల పరిధిలో మందుపాతరలు అమర్చినట్టు సమాచారం తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. పెద్దబయలు మండలం నానాబరి, జామిగూడ, సాలేబు, చింతలవీధితోపాటు ముంచంగిపుట్టు మండలం సరియపల్లి, జి.మాడ్గులో మందుపాతరలు అమర్చినట్టు నిర్థారణకు వచ్చారు.

దాంతో భద్రతా బలగాలు స్థానిక గిరిజనులను అప్రమత్తం చేశారు. ఎవరూ కొండప్రాంతం, అడవులవైపు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల హెచ్చరికలతో గిరిజనులకు మందుపాతరల భయం పట్టుకుంది. ఎక్కడా ఏ మందుపాతర పేలుతుందోనన్న టెన్షన్‌ వారిలో నెలకొంది.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా పూసునార్‌లో పోలీసులకు భారీ ప్రమాదం తప్పింది. రహదారిలో పాతిన మందుపాతరను పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి మందుపాతరను నిర్వీర్యం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు