ముషారఫ్ కు మరణశిక్షా ? యావజ్జీవమా ..?

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఉరిశిక్ష విధించాలని పాకిస్తాన్ లోని పెషావర్ కోర్టు తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని 6 వ అధికరణం కింద దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మరణశిక్ష సబబేనని కోర్టు పేర్కొంది. అయితే ఈ అధికరణం ఏమంటోంది ? రాజ్యాంగాన్ని అణచివేయడానికో, రద్దు చేయడానికో, బల ప్రయోగంతో అమలును వాయిదా వేయడానికో పాల్పడే ఎవరైనా , ఏ నియంత అయినా దేశద్రోహానికి పాల్పడినట్టేనని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. 1973 నాటి […]

ముషారఫ్ కు మరణశిక్షా   ? యావజ్జీవమా ..?
Follow us

|

Updated on: Dec 18, 2019 | 2:08 PM

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఉరిశిక్ష విధించాలని పాకిస్తాన్ లోని పెషావర్ కోర్టు తీర్పునిచ్చింది. పాక్ రాజ్యాంగంలోని 6 వ అధికరణం కింద దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు మరణశిక్ష సబబేనని కోర్టు పేర్కొంది. అయితే ఈ అధికరణం ఏమంటోంది ? రాజ్యాంగాన్ని అణచివేయడానికో, రద్దు చేయడానికో, బల ప్రయోగంతో అమలును వాయిదా వేయడానికో పాల్పడే ఎవరైనా , ఏ నియంత అయినా దేశద్రోహానికి పాల్పడినట్టేనని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. 1973 నాటి పాకిస్తాన్ ‘ హైట్రెజన్ (పనిష్మెంట్) యాక్ట్ ‘ ప్రకారం.. ఈ నేరానికి మరణశిక్ష లేదా యావజ్జీవ ఖైదు విధిస్తారు. అయితే ఇదే సమయంలో పెషావర్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పాక్ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కానుంది. స్పెషల్ కోర్టు ఇఛ్చిన తీర్పు సక్రమమేనని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినప్పటికీ.. రాజ్యాంగం లోని 45 వ అధికరణం కింద దేశాధ్యక్షుడు ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించవచ్ఛు. అధ్యక్షుడికి ఆ అధికారాలు ఉంటాయి. ఏ కోర్టు గానీ, లేదా ట్రిబ్యునల్ లేక అథారిటీ గానీ జారీ చేసే ఎలాంటి ఆదేశాలనైనా అధ్యక్షుడు నిలిపివేయవచ్ఛు. ముషారఫ్ దేశద్రోహి కారని పాక్ ఆర్మీ ఇదివరకే ప్రకటించింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రవచించిన రాజ్యాంగం ప్రకారం ఆయనకు న్యాయమే జరుగుతుందని సాయుధ దళాలు భావిస్తున్నాయి. ఏది.. ఎలా ఉన్నా .. దుబాయ్ లో స్వయం ప్రవాసంలో ఉన్న ముషారఫ్.. తన ఆరోగ్యం, తన వయోభారం దృష్ట్యా పాకిస్థాన్ కు తిరిగి రాకపోవచ్చు. 1999 లో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ముషారఫ్ పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అయితే ఆరు నెలల్లోపే నవాజ్ షరీఫ్ తిరిగి అధికారంలోకి వచ్చారు. వఛ్చిన వెంటనే 2013 డిసెంబరులో ముషారఫ్ పై కేసు మొదలైంది. 2007 నవంబరులో రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో ఎమర్జన్సీ విధించినందుకు, న్యాయమూర్తులను జైళ్లలో పెట్టించినందుకు ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదయింది. 2014 మార్చిలో ఆయనను అభిశంసించారు. అయితే కోర్టు విచారణ ఎన్నో మలుపులు తిరగడంతోను, ఇది (విచారణ) చాలా జాప్యం కావడంతోను ముషారఫ్ తన వైద్య చికిత్స కోసమంటూ 2016 లో దుబాయ్ చెక్కేశారు. కాగా.. పెషావర్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ముషారఫ్ మద్దతుదారులు మంగళవారం కరాచీలో ప్రదర్శన నిర్వహించారు. ఈ తీర్పును వారు ఖండించారు. తమ నేతకు న్యాయం జరగాలని నినదించారు.

రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.