విధి వైప‌రిత్యం..తాను కాపాడిన పామే..ప్రాణాలు తీసింది…

విధి వైప‌రిత్యం..తాను కాపాడిన పామే..ప్రాణాలు తీసింది...

ఆ ఇంటి చుట్టుప‌క్క‌ల మ‌రుగు ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్కువ‌గా పాములు ప్ర‌వేశిస్తూ ఉంటాయి. అందుకే అవి చొర‌బ‌డ‌కుండా త‌న ఇంటి వెనుక ఓ కంచెను నిర్మించుకున్నాడు ఓ వ్య‌క్తి. అయితే దురదృష్టవశాత్తూ కంచెలో చిక్కుకున్న పామును ర‌క్షించ‌బోయి అత‌డు త‌న‌ ప్రాణాలే పొగొట్టుకున్నాడు. త‌మిళ‌నాడు రాష్ట్రం మైలాడుదురై జిల్లా శీర్గాళి ద‌గ్గ‌ర్లోని ఆరపాక్కం గ్రామంలో ఈ విషాద‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర‌పాక్కం గ్రామానికి చెందిన రాజశేఖర్ ‌(35) అనే వ్య‌క్తి కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. […]

Ram Naramaneni

|

May 10, 2020 | 3:37 PM

ఆ ఇంటి చుట్టుప‌క్క‌ల మ‌రుగు ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్కువ‌గా పాములు ప్ర‌వేశిస్తూ ఉంటాయి. అందుకే అవి చొర‌బ‌డ‌కుండా త‌న ఇంటి వెనుక ఓ కంచెను నిర్మించుకున్నాడు ఓ వ్య‌క్తి. అయితే దురదృష్టవశాత్తూ కంచెలో చిక్కుకున్న పామును ర‌క్షించ‌బోయి అత‌డు త‌న‌ ప్రాణాలే పొగొట్టుకున్నాడు. త‌మిళ‌నాడు రాష్ట్రం మైలాడుదురై జిల్లా శీర్గాళి ద‌గ్గ‌ర్లోని ఆరపాక్కం గ్రామంలో ఈ విషాద‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

ఆర‌పాక్కం గ్రామానికి చెందిన రాజశేఖర్ ‌(35) అనే వ్య‌క్తి కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శ‌నివారం ఉద‌యం షాపు తెరిచిన కొంత‌సేప‌టికి ప‌క్కింట్లో పాము పాము అనే హాహాకారాలు వినిపించాయి. దీంతో అక్క‌డికి వెళ్లిన రాజ‌శేఖ‌ర్‌కు వారి ఇంటి వెనుక నిర్మించిన ఇనుప కంచెలో పాము చిక్కుకుని ఉండ‌టం తార‌స‌ప‌డింది. మంచి మ‌న‌సుతో దాన్ని ఇనుప కంచె నుంచి త‌ప్పించి… విడిచిపెడుతుంగానే కాటేసి ప‌క్క‌నే ఉన్న‌ పొద‌ల్లోకి వెళ్లిపోయింది. స్థానికులు వెంట‌నే రాజ‌శేఖ‌ర్‌ను శీర్గాళి ప్రభుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అత‌న్ని చిదంబరం ప్రభుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజ‌శేఖ‌ర్ ప్రాణాలు విడిచాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu