వెల్‌కమ్ బ్యాక్ టు “కుంతాల వాటర్ ఫాల్స్”..

ప్రకృతి అందాలకు నెలవైన కుంతాల జలపాతాలను దర్శించుకోడానికి ఎంతోమంది పర్యాటకులు,ప్రకృతి ప్రేమికులు తరలివస్తుంటారు. ఇటీవల ఈ జలపాతాల వద్ద పర్యాటకులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతుండటంతో అటవీశాఖ అధికారులు జలపాతం సందర్శనను నిలిపివేశారు. తాజగా ఈ నిబంధనలు సడలించారు అధికారులు. కుంతాల జలపాతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు అనుమతిని ఇస్తున్నారు. ఉట్నూరు డీఎస్పీ డేవిడ్ కుంటాల జలపాతాన్ని సందర్శించి పర్యాటకుల రాకను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బందికి ప్రమాదాలపై దిశానిర్దేశం చేశారు. ఎంతో సంతోషంగా ప్రకృతిని చూసేందుకు […]

వెల్‌కమ్ బ్యాక్ టు కుంతాల వాటర్ ఫాల్స్..
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 6:07 AM

ప్రకృతి అందాలకు నెలవైన కుంతాల జలపాతాలను దర్శించుకోడానికి ఎంతోమంది పర్యాటకులు,ప్రకృతి ప్రేమికులు తరలివస్తుంటారు. ఇటీవల ఈ జలపాతాల వద్ద పర్యాటకులు ప్రమాదవశాత్తు మృత్యువాత పడుతుండటంతో అటవీశాఖ అధికారులు జలపాతం సందర్శనను నిలిపివేశారు. తాజగా ఈ నిబంధనలు సడలించారు అధికారులు. కుంతాల జలపాతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు అనుమతిని ఇస్తున్నారు. ఉట్నూరు డీఎస్పీ డేవిడ్ కుంటాల జలపాతాన్ని సందర్శించి పర్యాటకుల రాకను ఆహ్వానించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బందికి ప్రమాదాలపై దిశానిర్దేశం చేశారు. ఎంతో సంతోషంగా ప్రకృతిని చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా దూరప్రాంతాల నుంచి ఈ జలపాతాలను చూసేందుకు వచ్చే వారికి ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కూడా అటవీ అధికారులను ఆదేశించారు.