టాప్ డిజాస్టర్ ఫిల్మ్స్ @ 2019

టాప్ డిజాస్టర్ ఫిల్మ్స్ @ 2019

86 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో సంచలన విజయాలు.. మరెన్నో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ప్రతీ హీరో అద్భుతమైన విజయంతో పాటుగా భారీ ప్లాప్‌లను సైతం చవి చూశాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 200కు పైగా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇందులో తెలుగు స్ట్రెయిట్ ఫిలిమ్స్‌తో పాటు వివిధ భాషల డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయి. ఇందులో కొన్ని చిత్రాలకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా.. వాటిని తారుమారు చేస్తూ అవి బాక్స్ […]

Ravi Kiran

|

Oct 16, 2019 | 6:29 PM

86 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో సంచలన విజయాలు.. మరెన్నో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి. ప్రతీ హీరో అద్భుతమైన విజయంతో పాటుగా భారీ ప్లాప్‌లను సైతం చవి చూశాడు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్‌లో ఏడాదికి సుమారు 200కు పైగా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఇందులో తెలుగు స్ట్రెయిట్ ఫిలిమ్స్‌తో పాటు వివిధ భాషల డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయి. ఇందులో కొన్ని చిత్రాలకు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా.. వాటిని తారుమారు చేస్తూ అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిపోతాయి. 2019కి గానూ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోయిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చూద్దాం.

1.వినయ విధేయ రామ:

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా తెరకెక్కించారు. మాస్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రిలీజైన తర్వాత అవి కాస్తా నీరు కారిపోయాయి. కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం.. సినిమా అంతా మూస పద్దతితో తెరకెక్కడంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్  అయింది.

2.ఎన్టీఆర్ బయోపిక్:

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితకథను రెండు పార్టులుగా తెరకెక్కించారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించాడు. అన్నగారి బయోపిక్ అంటే స్వతహాగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొంటాయి. కానీ సినిమా రిలీజైన తర్వాత మాత్రం పూర్తిగా ఫ్యాన్స్‌ను నిరాశపరించింది.

3.ఫలక్‌నుమా దాస్:

రౌడీ విజయ్ దేవరకొండ మాదిరిగా యంగ్ హీరో విశ్వక్ సేన్ యువతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పలు వివాదాలు చోటు చేసుకోవడం జరిగాయి. దానితో ఒక్కసారిగా చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. దీనితో విశ్వక్ సేన్.. వన్ ఫిలిం హీరోగా మిగిలిపోయాడు.

4.డియర్ కామ్రేడ్:

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం.. అంతేకాకుండా కొన్ని చోట్ల సీన్స్ లాగ్ కావడంతో ప్రేక్షకులను పెద్దగా నచ్చలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది గానీ.. ప్రైమ్‌లో మాత్రం ఎక్కువ మంది వీక్షకులను పొందగలిగింది.

5.మన్మధుడు 2:

ఈ సంవత్సరంలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన సినిమాల్లో ఇదొకటి. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘మన్మధుడు 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాటి ‘మన్మధుడు’ మేజిక్ రిపీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ కామెడీ జనాలు పెద్దగా నచ్చలేదు. దానితో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu