పాకిస్థాన్..! ఖబర్దార్..! దమ్ముందా..? మా సత్తా ఇదిగో..!

భారత్, పాకిస్థాన్‌కు నిజంగానే యుద్ధం వస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిది పైచేయి.. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు భారత్‌తో యుద్ధం చేసే దమ్ము ఉందా..? ఇప్పటికే భారత్‌తో నాలుగు సార్లు యుద్ధం చేసి.. ఘోర పరాజయం పొందిన పాక్‌కు.. అయిదో సారి కూడా యుద్ధం చేస్తే.. భారత్ సత్తా ముందు పాక్ ఎదురు నిలబడగలదా..? ప్రస్తుతం అంతటా ఇదే చర్చ.. ఈ నేపథ్యంలో టీవీ9 చేతికి చిక్కిన సమాచారం మీ కోసం… సరిహద్దు దేశం పాక్.. గత […]

పాకిస్థాన్..! ఖబర్దార్..! దమ్ముందా..? మా సత్తా ఇదిగో..!
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 5:17 PM

భారత్, పాకిస్థాన్‌కు నిజంగానే యుద్ధం వస్తే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిది పైచేయి.. ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు భారత్‌తో యుద్ధం చేసే దమ్ము ఉందా..? ఇప్పటికే భారత్‌తో నాలుగు సార్లు యుద్ధం చేసి.. ఘోర పరాజయం పొందిన పాక్‌కు.. అయిదో సారి కూడా యుద్ధం చేస్తే.. భారత్ సత్తా ముందు పాక్ ఎదురు నిలబడగలదా..? ప్రస్తుతం అంతటా ఇదే చర్చ.. ఈ నేపథ్యంలో టీవీ9 చేతికి చిక్కిన సమాచారం మీ కోసం…

సరిహద్దు దేశం పాక్.. గత రెండు నెలల నుంచి అక్కడి ప్రజల భాగోగులు చూడడం కంటే.. భారత్‌లో ఎలా అలజడి సృష్టించాలి.. ఎలా కయ్యానికి కాలు దువ్వాలి అన్న దానిపైనే ఎక్కువ ఆలోచిస్తోంది. అందుకు రీజన్ కూడా లేకపోలేదు. ఎప్పుడైతే గత ఆగస్ట్ నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు చేసిందో.. అప్పటి నుంచి పాక్‌కు నిద్ర కరువైనట్లు తెలుస్తోంది. అప్పటినుంచి భారత్‌పై కయ్యానికి కాలుదువ్వేందుకు.. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎలాగైనా భారత్‌లో అలజడి సృష్టించాలన్న లక్ష్యంతో.. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదులను దేశంలోకి ఉసిగొల్పుతోంది. అంతేకాదు.. నిత్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అయితే ఓ సందర్భంలో పాక్ మంత్రులు భారత్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ.. బహిరంగంగా ప్రకటనలు చేశారు. ఓ మంత్రి ఏకంగా అక్టోబర్‌ నెలలో భారత్‌తో యుద్ధం జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్‌ పైకి మాత్రం లైట్ తీసుకున్నా.. ఒకవేళ పాక్ యుద్ధంకి దిగితే.. ప్రపంచ పటంలో లేకుండా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ఇటీవల కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. అయితే ఒకవేళ పాక్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. భారత్ వద్ద ఉన్న అణ్వస్థ్రాలు కాకుండా.. ముఖ్యమైన వార్ వెపన్స్ ఏంటి.. వాటి సామర్ధం ఎంత..? అనేది ఓ సారి చూద్ధాం.

యుద్ధ ట్యాంకర్లతో సమానమైన అపాచీ హెలికాప్టర్లు.. 

భారత వాయుసేనలో ఇది అత్యాధునిక చాపర్. ఈ అపాచీ ఏహెచ్-64ఈ హెలికాఫ్టర్లు ప్రపంచంలోని అత్యాధునిక హెలికాఫ్టర్లలో తొలిస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం అమెరికా సైన్యం ఈ హెలికాఫ్టర్లను వినియోగిస్తోంది. ప్రస్తుతం ఇవి ఎనిమిది భారత్ వాయుసేనలో ఉన్నాయి. దీనిని ఎగిరే యుద్ధ ట్యాంకుగా పేర్కొంటారు. ఇది భీకరమైన దాడులను కూడా తట్టుకొనగలిగే శక్తి కలిగింది. ఈ హెలికాఫ్టర్‌లో అత్యాధునికమైన సాంకేతిక వ్యవస్థ ఉంది. ఇక రెండు టర్బో షాఫ్ట్ ఇంజిన్‌లు కలిగి ఉన్న ఈ చాపర్ గంటకు 284 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. ఇందులో ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. పైలట్‌తో పాటు గన్నర్ కూర్చోడానికి వీలుంటుంది. గన్నర్ టార్గెట్ ఫిక్స్ చేస్తే.. పైలట్ దాన్ని పేల్చే విధంగా దీంట్లో సిస్టమ్ ఉంటుంది. అయితే ఇవే కాకుండా… అపాచీ ఏహెచ్-64డీ, 64ఏ వంటి చాపర్లు కూడా ఉన్నాయి. ఇవి 64ఈ అంత అత్యాధునికమైనవి కాకున్నా.. ఇవి కూడా.. యుద్ధ రంగంలో.. బీభత్సాన్ని సృష్టించగలవు. తక్కువ ఎత్తులో ఎగురుతూ.. దీంట్లో నుంచి రాకెట్ లాంచర్లను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఇవి ఎదుర్కోగలవు.

INS విక్రమాదిత్య.. ఇది విమాన వాహన నౌక

INS విక్రమాదిత్య.. దీనిని రష్యా నుండి కొనుగోలు చేసింది. ఇది భారత్‌కు చెందిన విమాన వాహక నౌక. కీయెవ్ తరగతికి చెందిన అడ్మిరల్ గోర్ష్‌కోవ్ విమాన వాహక నౌకను విక్రమాదిత్యగా పునర్నిర్మించారు. ఇది 2013 లో భారతీయ నౌకాదళంలోకి ప్రవేశించింది. దీని బరువు 44500 టన్నులు, పొడవు 284 మీటర్లు. ఇదిమూడు ఫుడ్‌బాల్ మైదానాలతో సమానం. దాదాసే 20 అంతస్థుల ఎత్తులో ఉండే ఈ యుద్ధనౌక.. అధునాతన యుద్ధ విమానాలను, చాపర్లు, వార్ హెడ్లను మోసుకెళ్తుంది. అంతేకాదు దీనిపై యుద్ధ విమానాలు సునాయాసంగా ల్యాండింగ్ అవుతాయి. దీని ద్వారా జలమార్గంలో కూడా శత్రుదేశంపై దండయాత్ర చేయోచ్చు.

బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సెల్…

బ్రహ్మోస్ క్షిపణి.. దీనితో శత్రు దేశాలపై సులువుగా దాడులు చేయవచ్చు.ఇది అతి తక్కువ పరిధి గల సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సెల్. దీనిని అన్ని రకాలుగా ప్రయోగించవచ్చు. వాతావరణ పరిస్థితి ఏదైనా సరే.. శత్రుదేశంపై ఫిక్స్ చేసిన టార్గెట్‌ను ఖచ్చితంగా ఛేదిస్తుంది. సముద్రంపై నుండి, జలాంతర్గాముల నుండి, యుద్ధ విమానాల నుండి ప్రయోగించవచ్చు. భారత్‌, రష్యాలు సంయుక్తంగా దీనిని తయారు చేశాయి.

సుఖోయ్-30 MKI యుద్ధ విమానాలు

సుఖోయ్ యుద్ధ విమానాలు.. ఇవి భారత్‌లో అత్యాధునిక యుద్ధ విమానాలు. ఇవి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించగలవు. దీని ద్వారా 300 నుంచి 400 కిలోమీటర్ల లక్ష్యాలను ఈజీగా చేధించవచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల ఈ శక్తివంతమైన SU-30MKI యుద్ధ విమానాల్లో అధునాతన రాడార్ పరికరాలను ఏర్పాటు చేసింది. దీంతో శత్రుదేశ ఫైటర్ జెట్లను గుర్తించడమే కాకుండా వాటిని నిరంతరం పర్యవేక్షిస్తాయి. అంతేకాదు ఈ యుద్ద విమానాల్లో రష్యాకు చెందిన అడ్వాన్స్‌డ్ AESA టెక్నాలజీ గల రాడార్ సిస్టమ్‍ ఉంది. ఇది ఏకకాలంలో 30 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో ఒకేసారి ఆరు లక్ష్యాలను టార్గెట్ చేసుకుని దాడి చేయగలుగుతుంది.

ఐఎన్ఎస్ చక్ర సబ్ మెరైన్

భారత్‌ కు చెందిన కీలక అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్ర. ఈ సబ్‌ మెరైన్‌ సుమారు 12వేల టన్నుల బరువు, 190 మెగావాట్ల అణు రియాక్టర్‌ ను కలిగి ఉంటుంది. అత్యధికంగా గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 80 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఇందులో వ్యూహాత్మక క్షిపణులు, అగ్నిమాపక వ్యవస్థ, సోనార్‌ వ్యవస్థ, అత్యాధునిక పెరిస్కోప్‌ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సబ్ మెరీన్లలో ఇది కూడా ఒకటి. రహస్యంగా ప్రయాణిచండం ఈ సబ్ మెరైన్ సొంతం. దీంతో ఇది శత్రువుకు చిక్కకుండా ప్రయాణిస్తుంది. అయితే ఇదే దీని బలహీనత కూడా. ఇది ప్రయాణించే మార్గంలో ఇతర నౌకలు వచ్చి, ప్రమాదానికి గురవుతుంటాయి. ఇది సముద్రంతో పాటు నేలపై లక్ష్యాలను కూడా కచ్చితంగా ఛేదించగలదు.

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..