టాప్ 10 న్యూస్ @ 6PM

1.రేపు ఢిల్లీలో జైట్లీ అంత్యక్రియలు అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్…Read more 2.ఫ్రమ్ శ్రీనగర్ టు ఢిల్లీ.. రాహుల్ బృందం తిరుగుముఖం జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరో 11 […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 5:57 PM

1.రేపు ఢిల్లీలో జైట్లీ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్…Read more

2.ఫ్రమ్ శ్రీనగర్ టు ఢిల్లీ.. రాహుల్ బృందం తిరుగుముఖం

జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరో 11 మంది విపక్ష నాయకులను అక్కడినుంచి తిరిగి ఢిల్లీ పంపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో…Read more

3.మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ పురస్కారం!

యూఏఈలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ శనివారం మోదీని ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ మెడల్‌తో సత్కరించారు. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు…Read more

4.కోర్టు డ్రైవర్ కొడుకు జడ్జిగా.. ‘ లా ‘ హిస్టరీలో ట్విస్ట్ !

న్యాయ చరిత్రలో ఇదో కొత్త మలుపు ! కోర్టులో డ్రైవర్ గా పని చేసే వ్యక్తి కొడుకే న్యాయమూర్తి కాబోతున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కోర్టులో ఇదో సరికొత్త పరిణామం. అతని పేరు చేతన్ బజాద్.. ఈ మధ్యే సివిల్ జడ్జి క్లాస్-2 రిక్రూట్ మెంట్ కి సెలక్ట్ అయ్యాడు…Read more

5.పేర్లు దొరక్క… ఆండ్రాయిడ్ విలవిల!

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు తినుబండారాల పేర్లు పెడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గూగుల్ రకరకాల పదార్థాల…Read more

6.బిడ్డ అంటూ బిల్డప్..కిలాడీ మహిళ మోసానికి బ్రేక్!

అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం మనుషులు ఎంత క్రియేటీవ్‌గా ఆలోచిస్తున్నారో చెప్పడానికి తాజా ఘటన ఉదాహరణ. ఈ మాత్రం తెలివి బాగుపడటానికి ఉపయోగిస్తే ఎంత మంచిదో. కానీ జనాలు అతి తెలివి మాత్రం వీడటం లేదు.  ఓ కిలాడీ మహిళ…Read more

7.బిగ్‌బాస్ 3: రేపే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ..? శ్రద్ధా, హెబ్బా కాదు.. లిస్ట్‌లో తెలుగమ్మాయి..!

బుల్లితెరపై బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు, హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ఫన్నీ మెమొరీస్‌తో ప్రేక్షకులను ఈ షో కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలిమినేషన్‌లో ఎవరు ఉంటారన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది…Read more

8.మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

తిరువనంతపురం: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో  2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో…Read more

9.56 బంతుల్లో 134 నాటౌట్‌… 4 ఓవర్లలో 8 వికెట్లు…!

కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో భారత క్రికెటర్‌ కృష్ణప్ప గౌతమ్‌ సంచలన ప్రదర్శన చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో…Read more

10.ఆటోలో స్టార్ హీరోయిన్ షికారు..ఫ్యాన్స్ గుండె బేజారు!

సూపర్ స్టార్ మహేశ్ నటించిన  ‘భరత్‌ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ. అందం, అభినయంతో అదరగొట్టే ఈ భామ.. ముంబయి వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టింది. కొరియోగ్రాఫర్‌ షబినా ఖాన్‌తో…Read more