టాప్ 10 న్యూస్ @9PM

1.సర్వేలన్నీ ఆపార్టీవైపే.. రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టేది ఎవరంటే? సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి…Read more 2.‘మా’లో ముదిరిన వివాదాలు.. అసలు కారణాలు ఇవేనా? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో అంతర్గత కలహాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అధ్యక్షుడు నరేష్, జీవితా రాజశేఖర్ వర్గం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ‘మా’ […]

టాప్ 10 న్యూస్ @9PM
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2019 | 8:57 PM

1.సర్వేలన్నీ ఆపార్టీవైపే.. రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టేది ఎవరంటే?

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి…Read more

2.‘మా’లో ముదిరిన వివాదాలు.. అసలు కారణాలు ఇవేనా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో అంతర్గత కలహాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. అధ్యక్షుడు నరేష్, జీవితా రాజశేఖర్ వర్గం మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ‘మా’ అధ్యక్షుడు నరేష్ పనితీరుపై, నిధుల విషయంలో ప్రధాన కార్యదర్శి…Read more

3.కాపీ వివాదం.. సినిమా ప్రమోషన్‌లో భాగమేనా.?

సినిమా మొదలైనప్పటి నుంచి.. పూర్తయ్యే దాకా దర్శకనిర్మాతలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. టైటిల్, స్టోరీ, లేదా నటీనటుల పరంగా పలు సందర్భాల్లో అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో ఏదైనా చిత్రం విడుదలకు ముందు…Read more

4.వాళ్లు నూరేళ్ల కుర్రాళ్లు.. అందుకే అంత స్పీడుగా వచ్చారు

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. ఆయా రాష్ట్రాల్లో శతాధిక వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకోడానికి కష్టమైనా సరే…Read more

5.ఆర్టీసీ కార్మికుల పోరుబాట… మరో సకలజనుల సమ్మె?

తెలంగాణ ఈనెల 21 నుంచి పోరు తెలంగాణగా మారుతోంది. ఆర్టీసీ సమ్మెతో ఏకతాటిపైకి రాబోతోంది. కేసీఆర్ సర్కారుకు సెగ పుట్టించేలా ఆర్టీసీ కార్మికులు – ప్రజాసంఘాలు – రాజకీయాలు పార్టీలు కలిసి జేఏసీగా ప్రత్యక్ష ఉద్యమకార్యాచరణకు దిగబోతున్నాయి…Read more

6.యుఎస్‌లో ఇద్దరు టీనేజర్ల ‘ ఇండియన్ యాస’…. ఏం చేశారంటే .. ?

న్యూజెర్సీలో ఇద్దరు టీనేజర్లు తాము చదువుతున్న స్కూల్లోనే రెచ్చిపోయారు. లారెన్స్ టౌన్ షిప్ లో నివసించే 17 ఏళ్ళ కుర్రాళ్ళు ఇద్దరు చేసిన నిర్వాకమిది ! మరి.. వీరిద్దరిదీ ‘ భారతీయ భాష యాస ‘ అట ! కావాలనే అలా మాట్లాడారో లేదో గానీ అసలు…Read more

7.18,570 అడుగుల ఎత్తులో… 72 అడుగుల శివలింగం… శ్రీఖండ్ మహదేవ్!

సాధారణంగా హిమాలయాల్లో యాత్ర అనే మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. అయితే, అంతకు మించిన శ్రమతో భక్తులు వెళ్ళే యాత్ర శ్రీఖండ్ యాత్ర. సముద్రమట్టానికి…Read more

8.సఫారీల ఖేల్ ఖతం… క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా!

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలు ఓటమి అంచులో ఎదురీదుతున్నారు. సఫారీలపై ఇన్నింగ్స్‌ తేడాతో విజయానికి కసరత్తు దాదాపు పూర్తి అయింది. మరో 2 వికెట్లు దక్కితే…Read more

9.అజర్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూనే జట్టుకు కూడా చిరస్మరణీయ విజయాలన్నందిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు…Read more

10.నోరు జారిన ట్రంప్..చేశాడండీ బిగ్ మిస్టేక్ !

అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తను చేసిన పొరబాటుకు తానే బొక్క బోర్లా పడ్డాడు. ఈ ‘ మిస్టేక్ ‘ ఆయనను ఇబ్బందుల్లో పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. నాసా మహిళా వ్యోమగాములు జెస్సికా మీర్, క్రిస్టినా కోచ్ అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్…Read more