రేపే హీరో నిఖిల్ పెళ్లి!

రేపే హీరో నిఖిల్ పెళ్లి!

త‌ర త‌రాల శ‌క్తినీ, సార్వ‌భౌమాధికారాన్ని, గౌర‌వాన్ని, య‌థాత‌థంగా నిలుపుతామ‌నే ప్ర‌మాణ‌మే వివాహం.. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో పెళ్ళి గ‌డియలు వ‌స్తాయి. ఆ గ‌డియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే. స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌

TV9 Telugu Digital Desk

| Edited By:

May 13, 2020 | 3:52 PM

Tollywood Hero Nikhil: త‌ర త‌రాల శ‌క్తినీ, సార్వ‌భౌమాధికారాన్ని, గౌర‌వాన్ని, య‌థాత‌థంగా నిలుపుతామ‌నే ప్ర‌మాణ‌మే వివాహం.. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో పెళ్ళి గ‌డియలు వ‌స్తాయి. ఆ గ‌డియలు వ‌చ్చినప్పుడు జ‌ర‌గాల్సిందే. స్వామిరారా, సూర్య వ‌ర్స‌స్ సూర్య‌, కార్తికేయ‌, ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా, కేశ‌వ‌, అర్జున్ సుర‌వ‌రం లాంటి వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్ కి పెళ్లి గ‌డియలు రానే వ‌చ్చాయి..

డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ తో నిశ్చితార్థం జరిగిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 16న పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న విష‌యమూ తెలిసిందే. అయితే ప్ర‌పంచం మెత్తాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపించి ఎక్క‌డి వారిని అక్క‌డే వుండేలా మ‌నుషుల మధ్య దూరం వుండేలా చేసింది. ఈ ప‌రిస్థితిలో నిఖిల్ పెళ్ళి వాయిదా వేసుకున్నారు. అయితే క‌ళ్యాణం వ‌చ్చినా కక్కు వ‌చ్చినా ఆగ‌దు అనే పెద్ద‌ల సామెత నిజ‌మ‌వుతోంది. లాక్‌డౌన్ త‌రువాత మూఢం రావ‌టం.. ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వధూవరులు ఇద్ద‌రి జాత‌కాల రీత్యా ఈ నెల 14న పెళ్ళి చేయ‌టానికి ఇరు పెద్ద‌లు నిర్ణ‌యించారు.

అయితే సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా…. దగ్గరి బంధువుల సమక్షంలో ఇంట్లోనే పెళ్ళి చేసేందుకు నిశ్చ‌యించారు. ఈ పెళ్ళి లో ప్ర‌భుత్వం సూచించే అన్ని ప‌ద్ద‌తులు పాటిస్తున్నారు. అభిమానుల మధ్యలో ఈ పెళ్ళి ని ఆడంబరంగా చేసుకోవాల‌నుకున్న నిఖిల్ ఇప్ప‌డు ఈ పరిస్థితుల్లో కొవిడ్‌-19 వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే ఉద్ధేశ్యం తో ఈ పెళ్ళిని ఇలా నిరాడంబ‌రంగా చేసుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబందించిన ఫోటోస్‌, వీడియోస్ మాత్రం అధికారికంగా సోష‌ల్ మీడియా ద్వారా అందించ‌నున్నారు. ఈ నూత‌న‌ వ‌ధువ‌రుల‌ను ఎక్క‌డి వారు అక్క‌డే వుండి మనఃస్ఫూర్తిగా ఆశీర్వ‌దించాల‌ని నిఖిల్ కుటుంబం కోరుకుంటోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu