త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..వెండి మాత్రం..

బంగారం ధర తగ్గుతూనే ఉంది. గ‌త‌ మూడు రోజులుగా దిగువ చూపులే చూస్తూ ఉండటం గమనార్హం. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో ప‌సిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారం ధరపై ప్రతికూల ప‌రిణామాలు క‌న‌బ‌డుతున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు. ఊహించ‌ని విధంగా బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం అమాంతం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం ప‌సిడి ధర తగ్గింది. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.90 తగ్గుదలతో రూ.44,120కు ప‌డిపోయింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్ల […]

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు..వెండి మాత్రం..
Ram Naramaneni

|

Apr 21, 2020 | 9:00 PM

బంగారం ధర తగ్గుతూనే ఉంది. గ‌త‌ మూడు రోజులుగా దిగువ చూపులే చూస్తూ ఉండటం గమనార్హం. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో ప‌సిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారం ధరపై ప్రతికూల ప‌రిణామాలు క‌న‌బ‌డుతున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు. ఊహించ‌ని విధంగా బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం అమాంతం పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం ప‌సిడి ధర తగ్గింది. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.90 తగ్గుదలతో రూ.44,120కు ప‌డిపోయింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,430కు క్షీణించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1540 పెర‌గ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెండి ధర రూ.42,700 ప‌లుకుతుంది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్లు, నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు మొయిన్ రీజ‌న్ గా క‌నిపిస్తోంది.ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.42 శాతం డౌన్ ఫాల్ అయ్యింది. దీంతో ఔన్స్‌కు 1704.30 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో ప్ర‌యాణించింది. వెండి ధర ఔన్స్‌కు 1.23 శాతం తగ్గుదలతో 15.42 డాలర్లకు ప‌డిపోయింది.

ఇక మ‌న రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ.90 తగ్గుదలతో రూ.41,900కు ప‌డిపోయింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.90 తగ్గడంతో రూ.44,470కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర భారీగా రూ.1540 పెరిగింది. దీంతో ధర రూ.42,700కు ప‌లుకుతుంది. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu