త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా!

గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు కొండెక్కి కూర్చున్న బంగారం ధ‌ర‌లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో గోల్డ్ ధ‌ర త‌గ్గ‌డంతో, దేశీయ మార్కెట్‌లో కూడా అదే ట్రెండ్ కొన‌సాగుతోంది.

త‌గ్గిన బంగారం ధ‌ర‌లు, తాజా రేట్లు ఇలా!
Follow us

|

Updated on: Aug 18, 2020 | 8:48 AM

Today Gold Rate: గ‌త కొద్ది రోజుల వ‌ర‌కు కొండెక్కి కూర్చున్న బంగారం ధ‌ర‌లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో గోల్డ్ ధ‌ర త‌గ్గ‌డంతో, దేశీయ మార్కెట్‌లో కూడా అదే ట్రెండ్ కొన‌సాగుతోంది. అయితే బంగారం ధ‌ర త‌గ్గినప్ప‌టికీ వెండి ధ‌ర మాత్రం పైకి ఎగ‌సింది.

మంగ‌ళ‌వారం రోజున‌ హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్స్‌ గోల్డ్ ధర‌ రూ.340 పడిపోయింది. దీంతో ధర రూ.55,320కు తగ్గింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్స్‌ బంగారం ధర కూడా ప‌డిపోయింది. 10 గ్రాముల ప‌సిడి ధర రూ.310 తగ్గుదలతో రూ.50,700కు క్షీణించింది. పసిడి ధర పడిపోతే.. వెండి ధర మాత్రం ఎగ‌సింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగి.. రూ.68,900 చేరింది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ పెర‌గ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా చెప్పు‌కోవ‌చ్చు.

ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో కూడా ప‌సిడి ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.30 శాతం ప‌డిపోయింది. దీంతో గోల్డ్ రేటు ఔన్స్‌కు 1992 డాలర్లకు తగ్గింది. ప‌సిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 27.58 డాలర్లకు ప‌డిపోయింది.

ఇకపోతే బంగారం ధరపై చాలా అంశాలు ఎఫెక్ట్ చూపుతాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరల‌ను ప్రభావితం చేస్తాయి.

Also Read : తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌