‘సేవా సప్తాహ్‌’గా ప్రధాని పుట్టినరోజు!

‘సేవా సప్తాహ్‌’గా ప్రధాని పుట్టినరోజు!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ‘సేవా సప్తాహ్‌’పేరుతో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 17న మోదీ పుట్టినరోజు కావడంతో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛతా కార్యక్రమాలను భాజపా కార్యకర్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నేత అవినాశ్‌ రాయ్‌ ఖన్నా కన్వీనర్‌గా ఓ కేంద్ర కమిటీని కూడా భాజపా ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి అర్జున్ రాం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 29, 2019 | 11:39 PM

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ‘సేవా సప్తాహ్‌’పేరుతో వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 17న మోదీ పుట్టినరోజు కావడంతో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛతా కార్యక్రమాలను భాజపా కార్యకర్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నేత అవినాశ్‌ రాయ్‌ ఖన్నా కన్వీనర్‌గా ఓ కేంద్ర కమిటీని కూడా భాజపా ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్‌, జాతీయ కార్యదర్శులు సుధా యాదవ్‌, సునీల్‌ డియోధర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, కంటి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడున్న వారికి సాయం చేస్తారు. ఈ సందర్భంగా మోదీ జీవితంలో సాధించిన విజయాలు, సేవలకు సంబంధించిన వివరాలతో పుస్తకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల కార్యాలయాలకు పంపనున్నారు. వివిధ రాష్ట్రాల్లోని పార్టీ సీనియర్‌ నాయకులు ఆ పుస్తకాలను పంపిణీ చేస్తారు. మోదీ పిలుపు మేరకు భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సహా అందరూ ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా వివిధ యూనివర్సిటీల్లో క్యాంపైన్‌లు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు భాజపా వర్గాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu