అప్పడు అలా పారిపోయి.. ఇప్పుడు ఇలా దొరికిపోయాడు

సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ టిక్‌టాక్‌ను అంతా చెడ్డదిగానే చూస్తుంటారు. కానీ అది తల్చుకుంటే విడిపోయిన బంధాలను కూడా కలుపుతుందని నిరూపించింది. ఎప్పుడో సొంతఇంటిని, కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని విడిచిపెట్టిపోయిన ఓ వ్యక్తిని టిక్‌టాక్ వెతికి పెట్టింది. అదేంటీ అనుకుంటున్నారా? ఇది నిజం. తమిళనాడులోని విల్లుపురం కృష్ణగిరికి చెందిన సురేశ్ అనే వ్యక్తికి జయప్రద అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు. అయితే ఏమైందో ఏమో సురేశ్ భార్యతో గొడవపడి 2016లో […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:46 pm, Wed, 3 July 19
అప్పడు అలా పారిపోయి.. ఇప్పుడు ఇలా దొరికిపోయాడు

సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ టిక్‌టాక్‌ను అంతా చెడ్డదిగానే చూస్తుంటారు. కానీ అది తల్చుకుంటే విడిపోయిన బంధాలను కూడా కలుపుతుందని నిరూపించింది.

ఎప్పుడో సొంతఇంటిని, కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని విడిచిపెట్టిపోయిన ఓ వ్యక్తిని టిక్‌టాక్ వెతికి పెట్టింది. అదేంటీ అనుకుంటున్నారా? ఇది నిజం. తమిళనాడులోని విల్లుపురం కృష్ణగిరికి చెందిన సురేశ్ అనే వ్యక్తికి జయప్రద అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలుకూడా ఉన్నారు. అయితే ఏమైందో ఏమో సురేశ్ భార్యతో గొడవపడి 2016లో ఇల్లు విడిచి పారిపోయాడు. దీంతో ఇరువైపుల నుంచి బంధువులు ఎంత వెదకినా లాభం లేకపోయింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే సురేశ్ ఆచూకీ దొరకలేదు.

ఇదిలా ఉంటే టిక్‌టాక్ ప్రతిఒక్కరి ఫోన్‌లో కామన్ అయిపోయింది. జయప్రద బంధువు ఒకరు టిక్‌టాక్ వీడియోల్లో సురేశ్ లాంటి వ్యక్తిని చూశాడు. దీంతో ఇదే విషయాన్ని జయప్రదకు చెప్పాడు. వెంటనే అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించి వెదకడం ప్రారంభించారు. మొత్తానికి కర్నాటక రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో ఉన్నట్టుగా తేల్చారు. అయితే సురేశ్ ఇన్నాళ్లు ఒక ట్రాన్స్‌జెండర్‌తో కలిసి సహజీవనం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చివరికి సురేశ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి జయప్రదతో తిరిగి పంపారు పోలీసులు. ఇదిలా ఉంటే 2016లో ఇల్లు విడిచి వెళ్లిపోయిన సురేశ్.. కేవలం కుటుంబ గొడవల కారణంగానే వెళ్లిపోయినట్టుగా తేలింది.