#Lock-down పోలీసులా మజాకా.. బయటికొస్తే ఇదే గతి

లాక్ డౌన్ ఆదేశాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు తిరుపతి పోలీసులు. నయానా భయానా చెప్పినా వినని మొండి మనుషులకు కొత్త విధానంలో బుద్ది తెప్పించేందుకు యత్నించారు.

#Lock-down పోలీసులా మజాకా.. బయటికొస్తే ఇదే గతి
Follow us

|

Updated on: Apr 03, 2020 | 1:55 PM

Tirupati police variety treatment: లాక్ డౌన్ ఆదేశాలను, నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారికి తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇస్తున్నారు తిరుపతి పోలీసులు. నయానా భయానా చెప్పినా వినని మొండి మనుషులకు కొత్త విధానంలో బుద్ది తెప్పించేందుకు యత్నించారు. పోలీసులు అవలంభిస్తున్న కొత్త విధానాలతో ప్రజల్లో కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తమ కనీస అవసరాలు తీర్చకుండా ఇలా శిక్షించడమేంటని మరికొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

తిరుపతిలో లాక్ డౌన్ ఉల్లంఘించి రోడ్ల మీదికి వచ్చిన వందల మంది పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. రోడ్లమీదకి జనాన్ని రావద్దని చెబుతున్న పోలీసుల ఆదేశాలను జనం పెద్ద సంఖ్యలో నిర్లక్ష్యం చేస్తున్నారు. తెల్లారగానే పెద్ద సంఖ్యలో పలు కారణాలు చెబుతూ జనం రోడ్డెక్కుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదయం పూట సమయం ఇచ్చినా.. సామాజిక దూరాన్ని పాటించాలని నిర్దేశించింది. అయితే.. సామాజిక దూరం నిబంధనను ఏమాత్రం పాటించని ప్రజలు.. పోలీసులు తరుముతున్నా మళ్ళీ మళ్ళీ అదే ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి వారికి బుద్ది చెప్పడంతోపాటు.. మరోసారి నిర్లక్ష్య ధోరణిని అవలంభించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తిరుపతిలో రోడ్డెక్కిన జనానికి చుక్కలు చూపించారు పోలీసులు. లాక్ డౌన్‌ని నిర్లక్ష్యం చేస్తున్న జనాన్ని ఎండలో నిల్చోబెట్టి ప్రమాణం చేయించారు పోలీసులు. గంటపాటు ఎండలో నిల్చోబెట్టి పనిష్మెంట్ ఇస్తూనే మరోసారి రిపీట్ చేయమని ప్రమాణం చేయించారు. ఇంకెప్పుడూ రోడ్ల మీదికి రామని, కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేయించారు పోలీసులు. ఇంకోసారి రోడ్డు మీదికి వస్తే క్రిమినల్ కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చి మరీ వదిలేశారు. తిరుపతి పోలీసుల వినూత్న ప్రయోగాన్ని పలువురు ప్రశంసించారు. తమ సమస్యలను కూడా పట్టించుకోవాలంటూ కొందరు మాత్రం పోలీసుల వైఖరిని తప్పుపడుతున్నారు.