తిరుప‌తి : క‌రోనాతో వీడియో జ‌ర్న‌లిస్ట్ మృతి..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ పై క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉంది.

  • Ram Naramaneni
  • Publish Date - 6:51 pm, Sun, 12 July 20
తిరుప‌తి : క‌రోనాతో వీడియో జ‌ర్న‌లిస్ట్ మృతి..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ పై క‌రోనా ప్ర‌భావం అధికంగా ఉంది. కోవిడ్-19 కి సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తూ స‌మాజాన్ని అలెర్ట్ చేస్తోన్న జ‌ర్న‌లిస్టుల‌పై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తిరుప‌తిలో ఓ ఛానల్ కెమెరామెన్ పార్థ‌సార‌ధి క‌రోనాతో మృతి చెందారు. పద్మావతి కోవిడ్ ఆసుపత్రిలో ఈ రోజు సాయంత్రం త‌నువు చాలించారు. నాలుగు రోజుల క్రితం పార్థ‌సార‌ధికి కరోనా పాజిటివ్ అని తేల‌డంతో చికిత్స కోసం కోవిడ్ ఆస్ప‌త్రికి వెళ్లారు. ఊపిరి పీల్చుకోలేని ప‌రిస్థితుల్లో మూడు రోజులుగా వెంటిలేటర్ పైనే ఆయ‌నకు చికిత్స అందించారు వైద్యులు. వ్యాధిపై పోరాడ‌లేక‌..ఆయ‌న ఈరోజు క‌న్నమూశారు. కాగా గత ఇరవై ఏళ్లుగా వివిధ ఛానళ్లలో కెమెరామెన్ గా సేవ‌లందించారు పార్థ‌సార‌ధి. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లు జ‌ర్న‌లిస్ట్ సంఘాలు సంతాపం ప్ర‌క‌టించాయి.