తిరుమల వెంక‌న్న‌ భక్తులకు శుభ వార్త..ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు…

తిరుమ‌ల వెంక‌న్న భ‌క్తుల‌కు టీటీడీ శుభ వార్త‌ చెప్పింది. శ్రీవారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జూలై నెల‌కు సంబంధించిన రూ. 300 ప్రత్యేక‌ ప్రవేశ ద‌ర్శన టికెట్ల కోటాను ఈ నెల 29 నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయ‌నుంది.

  • Ram Naramaneni
  • Publish Date - 8:55 pm, Sun, 28 June 20
తిరుమల వెంక‌న్న‌ భక్తులకు శుభ వార్త..ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు...
T

తిరుమ‌ల వెంక‌న్న భ‌క్తుల‌కు టీటీడీ శుభ వార్త‌ చెప్పింది. శ్రీవారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జూలై నెల‌కు సంబంధించిన రూ. 300 ప్రత్యేక‌ ప్రవేశ ద‌ర్శన టికెట్ల కోటాను ఈ నెల 29 నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయ‌నుంది. రోజుకు 9,000 టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానం వివరించింది. అలాగే, జూలై ఒకట‌వ తేదీ నుంచి రోజుకు 3,000 చొప్పున స‌ర్వ ద‌ర్శనం టోకెన్లను కూడా విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది.

తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా శ్రీవారి భ‌క్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లను తీసుకోవ‌చ్చు. జూలై ఒకటిన శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి దర్శనానికి సంబంధించిన టోకెన్స్ తిరుపతిలోని కౌంటర్లలో మంగళవారం జారీ చేస్తారు. కాగా జూలై 30 నుండి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి ప‌విత్రోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.