వచ్చే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

వచ్చే నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ కానున్నాయి. సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేకాదు సెప్టెంబరు మాసంలో శ్రీవారికి విశేష పర్వదినాలు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 8:50 pm, Wed, 26 August 20
వచ్చే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

వచ్చే నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు షురూ కానున్నాయి. సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేకాదు సెప్టెంబరు మాసంలో శ్రీవారికి విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబ‌ర్ 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం, 17న మహాలయ అమావాస్య ఉంది. ఇక, 18వ తేదీన‌ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.

సెప్టెంబరు 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జా‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్త‌వుతాయి. ఇక‌ సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం జ‌రుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.