ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా.. ? ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతి..

ఆన్‌లైన్ బ్యాంకింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇది కొన్ని ప్రమాదాలతో కూడుకుంది. మనకు తెలియకుండానే మన ఏటిఎంలలో  డబ్బులు కట్ అవ్వడం, డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోన్ అవ్వడం గురించి ఈ మధ్య న్యూస్ వింటూనే ఉన్నాం. అలాగే ఆన్‌లైన్ ఖాతాలపై కూడా ఈ మధ్య కొందరు కేటుగాళ్లు దృష్టి పెట్టి అకౌంట్‌లో డబ్బును కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే ఆన్‌లైన్‌లో మీ నష్టాలను తగ్గించవచ్చు. 1. ఈ మధ్య చాలా […]

ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా.. ? ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే సంగతి..
Follow us

|

Updated on: Dec 04, 2019 | 8:43 PM

ఆన్‌లైన్ బ్యాంకింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఇది కొన్ని ప్రమాదాలతో కూడుకుంది. మనకు తెలియకుండానే మన ఏటిఎంలలో  డబ్బులు కట్ అవ్వడం, డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోన్ అవ్వడం గురించి ఈ మధ్య న్యూస్ వింటూనే ఉన్నాం. అలాగే ఆన్‌లైన్ ఖాతాలపై కూడా ఈ మధ్య కొందరు కేటుగాళ్లు దృష్టి పెట్టి అకౌంట్‌లో డబ్బును కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలను ఫాలో అయితే ఆన్‌లైన్‌లో మీ నష్టాలను తగ్గించవచ్చు.

1. ఈ మధ్య చాలా బ్యాంకులు.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం ఓ చిన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌ను అందిస్తాయి. మీరు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరుపుతున్నప్పుడు, ఆ డివైజ్‌కు ఒక కోడ్ వస్తుంది.  ఈ కోడ్‌కు చాలా తక్కువ కాలం మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ పరికరాలు తీసుకోడానికి మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. 

2. లాగిన్స్ కోసం బలమైన, పొడవైన పాస్‌వర్డ్‌ను సృష్టించండి.  పెద్ద మరియు చిన్న అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాల కలయికతో  పాస్ వర్డ్ ఉండేలా డిజైన్ చేసుకోండి. మీ పేరు, అక్షరాలు లేదా మీ పుట్టిన తేదీని కలిగి ఉన్న పాస్‌వర్డ్‌ను ఎప్పుడూ సృష్టించవద్దు.

3. మీ కంప్యూటర్‌ లేదా ఫోన్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పుడు అవి సెక్యూర్‌గా ఉండేలా ప్లాన్ చేస్తోంది.  ఫైర్‌వాల్ ఆన్ చేసి, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. 

4. ఫేక్ కాల్స్‌ని నమ్మకండి. మీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని కొందరు తప్పుడు మాటలు చెప్పి మీ నుంచి అకౌంట్, కార్డ్స్‌కి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, నిమిషాల్లో సొమ్మంతా కొల్లగొడతారు. దయచేసి అలాంటి కాల్స్‌కు దూరంగా ఉండండి.

5. మైబైల్‌కి వచ్చే తెలియని లింక్స్ అస్సలు క్లిక్ చెయ్యెద్దు. ఇవి చాలా డేంజరస్.  అలా చేస్తే మీరు ఫోన్లో చేసే ప్రతి పని వారికి తెలిసిపోతుంది. ఈ మధ్య ఇటువంటి క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం.

6. సురక్షిత స్థానం నుండి మీ ఖాతాలను యాక్సెస్ చేయండి. మీకు తెలిసిన మరియు విశ్వసించే కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లను ఉపయోగించి మీ బ్యాంక్‌కు కనెక్ట్ అవ్వడం ఎల్లప్పుడూ ఉత్తమ పద్ధతి. మీరు మీ బ్యాంకును రిమోట్ ప్రదేశాల నుండి ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవలసి వస్తే మీరు VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) ను సెటప్ చేసుకోవచ్చు.  

7. మీరు చెయ్యాల్సిన లావాదేవీ అవ్వగానే వెంటనే ఆన్‌లైన్ బ్యాకింగ్‌ను లాగ్ అవుట్ చేయండి.  ఇది సెషన్ హైజాకింగ్, క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ దోపిడీలకు బలైపోయే అవకాశాలను తగ్గిస్తుంది. మీరు మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్‌లో ప్రైవేట్ బ్రౌజింగ్ యొక్క ఆప్షన్ను కూడా సెటప్ చేసుకోవచ్చు.