టిక్‌టాక్‌లో ఇండియానే టా‌ప్‌.. అట..!

టిక్‌టాక్ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌తో చాలా మంది ఫేమ్ అవుతుంటే.. మరికొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. అయినా.. వీటి వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా.. వచ్చిన లెక్కల ప్రకారం టిక్‌టాక్ యాప్‌ డౌన్‌లోడింగ్ విషయంలో.. భారతే టాప్‌ అట. ప్రస్తుతం.. నిర్వహించిన సర్వేలో.. ప్రపంచ వ్యాప్తంగా 2019 సంవత్సరానికి గాను మొత్తం డౌన్‌లోడ్లు 1.5 బిలియన్లు కాగా.. అందులో 614 మిలియన్ అంటే 31 శాతం డౌన్‌లోడ్లతో భారత్‌నే […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:13 pm, Sun, 17 November 19
టిక్‌టాక్‌లో ఇండియానే టా‌ప్‌.. అట..!

టిక్‌టాక్ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌తో చాలా మంది ఫేమ్ అవుతుంటే.. మరికొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. అయినా.. వీటి వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా.. వచ్చిన లెక్కల ప్రకారం టిక్‌టాక్ యాప్‌ డౌన్‌లోడింగ్ విషయంలో.. భారతే టాప్‌ అట.

ప్రస్తుతం.. నిర్వహించిన సర్వేలో.. ప్రపంచ వ్యాప్తంగా 2019 సంవత్సరానికి గాను మొత్తం డౌన్‌లోడ్లు 1.5 బిలియన్లు కాగా.. అందులో 614 మిలియన్ అంటే 31 శాతం డౌన్‌లోడ్లతో భారత్‌నే అగ్రస్థానంలో ఉందట. 2018 ఏడాదితో పోల్చితే.. 2019 సంవత్సరంలో.. ఆరు శాతం డౌన్‌లోడింగ్ శాతం పెరిగిందట.