‘టిక్‌టాక్’‌కు వ‌ణుకు పుట్టిస్తోన్న భార‌తీయ యాప్ ‘చింగారి’..

బార్డ‌ర్ వివాదం విష‌యంలో భారత్-చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనీస్ వ‌స్తువులు బ్యాన్ చేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయి.

‘టిక్‌టాక్'‌కు వ‌ణుకు పుట్టిస్తోన్న భార‌తీయ యాప్ ‘చింగారి’..
Follow us

|

Updated on: Jun 25, 2020 | 8:05 PM

బార్డ‌ర్ వివాదం విష‌యంలో భారత్-చైనాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చైనీస్ వ‌స్తువులు బ్యాన్ చేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా యాప్ టిక్‌టాక్ కూడా వాడొద్ద‌ని భారీగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా మ‌రో ఇండియ‌న్ యాప్ ‘చింగారి’ రేస్ లోకి వ‌చ్చింది. వ‌చ్చిన 3 మూడు రోజుల్లోనే ఈ యాప్ 5 ల‌క్ష‌ల డౌన్‌లోడ్స్ తో సంచ‌ల‌నం రేపింది. తాజాగా 20 లక్ష‌ల డౌన్‌లోడ్స్ దాటాయి. ప్ర‌స్తుతం గూగుల్ స్టోర్‌లో ‘చింగారి యాప్ ట్రెండింగ్‌లో కొన‌సాగుతోంది. ‘బైకాట్ చైనా ప్రొడ‌క్ట్స్’ నినాదంలో భాగంగా ల‌క్ష‌లాది మంది ఈ భార‌తీయ యాప్ వైపు అడుగులు వేస్తున్నారు. దీనిపై చింగారి స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిశ్వాత్మ నాయ‌క్ స్పందించారు.

‘టిక్‌టాక్’‌కు ఇప్పుడు భార‌తీయులు ప్రత్యామ్నాయం వెతుకుతున్న నేప‌థ్యంలో అంద‌రి అంచ‌నాలు అందుకునేలా ‘చింగారి’ యాప్ రూపొందించిన‌ట్టు తెలిపారు. కానీ ఇంత భారీ క్రేజ్ ఉంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని.. యాప్ వాడుతోన్న‌ వినియోగ‌దారులు సంతోషం వ్య‌క్తం చేయ‌డం సంతృప్తినిస్తోంద‌న్నారు. కాగా ఆడియో, వీడియో ప్లాట్‌ఫామ్‌ను 2019లోనే డెవ‌ల‌ప్ చేశామ‌ని తెలిపారు. ఇందులో కొత్త వ్య‌క్తుల‌తో చాట్ చేయ‌డంతో పాటు వీడియోలు అప్‌లోడ్ చేయ‌వ‌చ్చని వివ‌రించారు. ఈ యాప్‌లో ఉన్న మ‌రో స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో ఎవ‌రి వీడియోలు వైర‌ల్ అవుతాయో వారికి పాయింట్లు యాడ్ అవుతాయి. దీన్ని డ‌బ్బు సంపాద‌న‌కు ఒక మార్గంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్ తెలుగు, క‌న్న‌డ‌, తమిళ‌, మ‌ల‌యాళ, ఇంగ్లీష్‌, హిందీ, మ‌రాఠీ, బంగ్లా, పంజాబీ భాష‌ల్లో అందుబాటులో ఉంది.

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..