ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కనున్న టిక్ టాక్

అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని బ్యాన్ చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కాలని ఈ చైనీస్ యాప్ నిర్ణయించింది. తమ దేశ భద్రతకు టిక్ టాక్ కార్యకలాపాలు..

  • Publish Date - 1:23 pm, Sun, 23 August 20 Edited By: Pardhasaradhi Peri
ట్రంప్ నిర్ణయంపై కోర్టుకెక్కనున్న టిక్ టాక్

అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని బ్యాన్ చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కాలని ఈ చైనీస్ యాప్ నిర్ణయించింది. తమ దేశ భద్రతకు టిక్ టాక్ కార్యకలాపాలు ముప్పుగా పరిణమిస్తున్నాయని, అందువల్ల..దీనితో..ముఖ్యంగా దీని మాతృక సంస్థ బైట్ డాన్స్ తో బిజినెస్ చేయడాన్ని అమెరికన్లు మానుకోవాలని ట్రంప్ ఇటీవల ఆదేశించారు. ఇందుకు వారికి  45 రోజుల గడువును కూడా ఇచ్చారు.  అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని సవాలు చేయాలని టిక్ టాక్ భావిస్తోంది. తమ యూజర్లంతా ఈ యాప్ ని ఎంతో అభిమానిస్తున్నారని, అలాంటప్పుడు ట్రంప్ ప్రభుత్వ చర్యను కోర్టు ద్వారా ఎదుర్కోవడం తప్ప తమకు మరో మార్గం లేదని టిక్ టాక్ చెబుతోంది.

అమెరికా సెక్యూరిటీకి మేము ఎలాంటి ముప్పునూ కలిగించడంలేదు.. ట్రంప్ నిర్ణయం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నది అని టిక్ టాక్ దుయ్యబట్టింది.