టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా

టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఈ కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేస్తూ.. కారణాన్ని మాత్రం వివరించలేదు. అమెరికాలో తమ సంస్థ కార్యకలాపాలను నిషేధిస్తున్నట్టు...

  • Publish Date - 11:37 am, Thu, 27 August 20 Edited By: Anil kumar poka
టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా

టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఈ కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేస్తూ.. కారణాన్ని మాత్రం వివరించలేదు. అమెరికాలో తమ సంస్థ కార్యకలాపాలను నిషేధిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని సవాలు చేస్తూ..టిక్ టాక్ ఉద్యోగుల్లో ఒకరు వేరుగా కోర్టుకెక్కారు. బహుశా ఈ పరిణామం వల్లే మేయర్ రాజీనామా చేశారని భావిస్తున్నారు. అటు-భారమైన హృదయంతో తాను ఈ సంస్థ నుంచి వైదొలగుతున్నానని కెవిన్ మేయర్..స్టాఫ్ కి రాసిన ఓ లేఖలో తెలిపారు. ఇక ఈయన స్థానే ఈ సంస్థ ప్రస్తుత జనరల్ మేనేజర్ వనేసా పప్పాస్ తాత్కాలిక సీఈఓ గా వ్యవహరించనున్నారు. మేము మీ దేశ భద్రతకు ముప్పు ఎలా అవుతామంటూ టిక్ టాక్ తో బాటు బైట్ డాన్స్ కూడా పదేపదే ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందే చైనా వ్యతిరేక ప్రచారంలో భాగంగానే టిక్ టాక్ ని బ్యాన్ చేశారు కదూ అని రెండు సంస్థలూ గుర్రుమంటున్నాయి.కాలిఫోర్నియాలో ఉన్న టిక్ టాక్ కార్యాలయం మాత్రం బోసిపోయి ఉంది.