వరుస పులి దాడులతో వణికిపోతోన్న కాగజ్ నగర్ కారిడార్.. మాటు వేసి వేట సాగిస్తున్న బెబ్బులి, ఆదివాసీల ఆగ్రహాం

ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ కారిడార్ వరుస పులి దాడులతో వణికిపోతోంది. మాటు వేసి వేట సాగిస్తున్న బెబ్బులి.. మనుషులపై సైతం తన ప్రతాపాన్ని..

వరుస పులి దాడులతో వణికిపోతోన్న కాగజ్ నగర్ కారిడార్.. మాటు వేసి వేట సాగిస్తున్న బెబ్బులి, ఆదివాసీల ఆగ్రహాం
Follow us

|

Updated on: Dec 12, 2020 | 3:31 PM

ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ కారిడార్ వరుస పులి దాడులతో వణికిపోతోంది. మాటు వేసి వేట సాగిస్తున్న బెబ్బులి.. మనుషులపై సైతం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. పులిని బంధించేందుకు అటవిశాఖ చేస్తున్న ప్రయత్నాలు సత్పాలితాలను ఇవ్వడం లేదు. వెరసి.. పులి సంచారం విషయమై అటవీశాఖ అధికారుల తీరును ఆదివాసీలు తప్పుబడుతున్నారు. దిగిడలో విఘ్నేష్ అనే వ్యక్తిపై పులి దాడి చేసిన నాటి నుండి మొదలు, కొండపల్లిలో నిర్మల అనే మహిళపై మరోసారి పులి పంజా విసిరేంత వరకు అటవీ అధికారులు తూతూ మంత్రంగానే చర్యలు చేపట్టారని.. మనుషులపై దాడులు చేస్తున్నా పులులను కాగజ్ నగర్ కారిడార్ నుండి తరమడంలో అటవి శాఖ అధికారులు ఫేయిలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. అంతేకాదు, మనుషులపై దాడులు చేసే పులులను కావాలనే తమ ప్రాంతంలో వదిలారని ఆరోపిస్తున్నారు.

కొండపల్లిలో పులి దాడి ఘటన తరువాత సులుగు పెల్లి, బెజ్జూర్, వేల్పులగుట్ట, లోహా ప్రాంతాల్లో పులి సంచరించింది. ఏకంగా వారం రోజుల్లో 15 కు పైగా పశువులపై దాడి చేసింది. ఇంత జరుగుతున్నా అటవిశాఖ అధికారుల బోన్లు , ట్రాప్ కెమెరాలంటూ తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని గుర్రుగా ఉన్నారు ఆదివాసీలు. పులి సంచారంతో బతుకు దెరువు కోల్పోయామని.. పత్తి తీయడం, పొలం పనులు, అటవి ఉత్పత్తులు సేకరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మూడు పులులతో కాగజ్ నగర్ కారిడార్ లోని 110 గ్రామాల్లో 12 పులులు సంచారిస్తున్నాయని.. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతుందంటున్నారు గిరిజన గూడాల గ్రామస్తులు. పులిని బూచిగా చూపి పోడు వ్యవసాయ చేయకుండా.. అటవీ ఉత్పత్తులు సేకరించకుండా అటవీశాఖ కుట్ర పన్నుతుందని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.