కర్నూలు జిల్లాలో పెద్దపులి కలకలం

కర్నూలు జిల్లాలో పెద్దపులి సంచారం సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వెలుగొడు తెలుగు గంగ కాలువ సమీపంలో గొర్రెల మందపై పెద్దపులి దాడి చేయడంతో రెండు గొర్రెలు మృతి..

కర్నూలు జిల్లాలో పెద్దపులి కలకలం

కర్నూలు జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వెలుగొడు తెలుగు గంగ కాలువ సమీపంలో పెద్దపులి గొర్రెల మందపై దాడి చేసింది. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందాయి. పులి దాడి చేసిన ఘటనపై గొర్రెల కాపరి హనుమంతు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పులికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమైన అధికారులు.

పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి పులి వస్తోందనని బిక్కుబిక్కుమంటూ క్షణాలు లెక్కబెడుతున్నారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని  స్థానికులు కోరుతున్నారు.