గుంటూరు జిల్లాలో విషాదం..కుక్క‌ల దాడిలో మూడేళ్ల బాలిక మృతి

గుంటూరు జిల్లాలో విషాదం..కుక్క‌ల దాడిలో మూడేళ్ల బాలిక మృతి

గుంటూరు జిల్లాలో కుక్క‌లు వీర‌విహారం చేశాయి మాచవరం మండలంలో పిన్నెల్లిలో మూడేళ్ల బాలికపై దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాల‌వ‌డంతో బాలిక‌ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మ‌రో బాలికతో కలిసి ఆడుకుంటుండగా సపురా(3) అనే బాలిక‌పై కుక్కలు ఒక్క‌సారిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారికి మెడ, శరీర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలిక‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్ప‌టికే మృతి చెందినట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఘ‌ట‌న‌పై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం […]

Ram Naramaneni

|

May 01, 2020 | 12:42 PM

గుంటూరు జిల్లాలో కుక్క‌లు వీర‌విహారం చేశాయి మాచవరం మండలంలో పిన్నెల్లిలో మూడేళ్ల బాలికపై దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాల‌వ‌డంతో బాలిక‌ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

మ‌రో బాలికతో కలిసి ఆడుకుంటుండగా సపురా(3) అనే బాలిక‌పై కుక్కలు ఒక్క‌సారిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారికి మెడ, శరీర భాగాలపై తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన బాలిక‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్ప‌టికే మృతి చెందినట్లు డాక్ట‌ర్లు తెలిపారు. ఘ‌ట‌న‌పై స్థానికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మేల్కొని కుక్కల బెడద తప్పించాలని కోరుతున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu