సిగరెట్ షేర్ చేసుకున్న ముగ్గురు మిత్రులు..సీన్ కట్ చేస్తే…

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు హైదరాబాద్ జియాగూడలో తెలిసినవారి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు. షాద్‌నగర్‌కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి సిగరెట్ తాగాడు. ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకోవడంతో ..

  • Jyothi Gadda
  • Publish Date - 3:47 pm, Thu, 28 May 20
సిగరెట్ షేర్ చేసుకున్న ముగ్గురు మిత్రులు..సీన్ కట్ చేస్తే...

తెలంగాణలో కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి రకరకాలుగా విస్తరిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన రీతిలో కరోనా లింకులు బయటపడ్డాయి. ఒక్క సిగరెట్‌తో ముగ్గురికి వైరస్ సోకింది. కరోనా విస్తరణకు ఒక సిగరెట్ కారణమైందని తెలిసి అందరూ విస్తూ పోయారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన యువకుడు హైదరాబాద్ జియాగూడలో కరోనా వచ్చిన వారి అంత్యక్రియలకు వెళ్లొచ్చాడు. షాద్‌నగర్‌కు తిరిగొచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి సిగరెట్ తాగాడు. ముగ్గురు స్నేహితులు ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకోవడంతో ..ముగ్గురికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ముగ్గురినీ క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు షాద్‌నగర్‌లో ఇప్పటికే కరోనా కేసులు ఏడుకు చేరుకున్నాయి.