తల్లి మరణంతో షాక్‌లోకి తోబుట్టువులు..పదేళ్లపాటు చీకటి గదిలో..మానవ వ్యర్థాల మధ్యే జీవనం

అమ్మ అనారోగ్యంతో చనిపోయింది..అప్పటి వరకు హ్యాపీగా సాగిన వారి జీవితంలో చీకటి ఏర్పడింది. ఆమె లేని రోజునే వారు అస్సలు ఊహించుకోలేకపోయారు.

  • Ram Naramaneni
  • Publish Date - 8:41 pm, Tue, 29 December 20
తల్లి మరణంతో షాక్‌లోకి తోబుట్టువులు..పదేళ్లపాటు చీకటి గదిలో..మానవ వ్యర్థాల మధ్యే జీవనం

అమ్మ అనారోగ్యంతో చనిపోయింది..అప్పటి వరకు హ్యాపీగా సాగిన వారి జీవితంలో చీకటి ఏర్పడింది. ఆమె లేని రోజునే వారు అస్సలు ఊహించుకోలేకపోయారు. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా ఆమె సంతానం షాక్‌కు గురయ్యారు. అప్పట్నుంచి ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయారు. ముగ్గరూ తోబుట్టువులు ఒక గదికే పరిమితమైపోయారు. ఓ గదిలో తలుపులు వేసుకుని తమని తాము బందీలు చేసుకున్నారు. ఆ గది కూడా పూర్తి చీకటితో నిండి ఉండేది. ఇలా ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా పదేళ్లు గడిపారు. ‘సాథీ సేవ గ్రూప్‌’ అనే ఎన్జీవో చొరవ తీసుకుని తండ్రి సహకారంతో ఆ తోబుట్టువులను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ గదంతా వెలుతులు లేకుండా.. మానవ వ్యర్థాలతో నిండిపోయిందని ఆ ఎన్జీవో ప్రతినిధి జల్పా పటేల్‌ తెలిపారు. ఆ ముగ్గురు తోబుట్టువుల్లో ఇద్దరు సోదరులు, ఒక సోదరి అని వివరించారు. మొదట వారిని చూసినప్పుడు షాక్‌కు గురయ్యామని.. అఘోరాల కన్నాదారుణంగా కనిపించారని చెప్పారు. రోజూ గది బయట వారి నాన్న ఆహారం పెడితే తినేవారు తప్పితే..బయటకు వచ్చేవారు కాదని వివరించారు. బాధితుల్లో పెద్ద తనయుడు అమ్రీష్‌ (42) ఎల్‌ఎల్‌బీ, కుమార్తె మేఘన (39) సైకాలజీలో ఎంఏ చేయడం గమనార్హం. చిన్న కుమారుడు ఆర్థికశాస్త్రంలో బీఏ చేశాడు. ఇప్పటికీ వారి మానసిక పరిస్థితి సరిగా లేదని.. డాక్టర్ల పర్యవేక్షణ అవసరమని పటేల్‌ వివరించారు.

Also Read :

Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు