కెన్యాలోనూ అమెరికాకు ఎదురుగాలి.. యుఎస్ మిలిటరీ బేస్‌‌‌‌‌‌‌‌పై దాడి

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2020 | 5:40 PM

ఇరాన్, ఇరాక్ తరువాత అమెరికాకు ఇప్పుడు కెన్యాలోనూ ఎదురుగాలి వీస్తోంది. ఆ దేశ కోస్తా తీరంలోని లామూ ప్రాంతంలో గల యుఎస్ సైనిక బేస్ లో ఆదివారం  సోమాలియాకు చెందిన అల్-షబాబ్ గ్రూపు సభ్యులు దూసుకు వచ్చి .. ఈ మిలిటరీ స్థావరంపై దాడులకు పాల్పడడమే గాక.. ముగ్గురు అమెరికన్లను హతమార్చారు. అమెరికాకు చెందిన పలు విమానాలను, సైనిక వాహనాలను ధ్వంసం చేశారు.  క్యాంప్ సింబాలో హెవీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారు ముందుకు చొచ్చుకురాగా.. వారిని అమెరికన్ […]

కెన్యాలోనూ అమెరికాకు ఎదురుగాలి.. యుఎస్ మిలిటరీ బేస్‌‌‌‌‌‌‌‌పై దాడి

ఇరాన్, ఇరాక్ తరువాత అమెరికాకు ఇప్పుడు కెన్యాలోనూ ఎదురుగాలి వీస్తోంది. ఆ దేశ కోస్తా తీరంలోని లామూ ప్రాంతంలో గల యుఎస్ సైనిక బేస్ లో ఆదివారం  సోమాలియాకు చెందిన అల్-షబాబ్ గ్రూపు సభ్యులు దూసుకు వచ్చి .. ఈ మిలిటరీ స్థావరంపై దాడులకు పాల్పడడమే గాక.. ముగ్గురు అమెరికన్లను హతమార్చారు. అమెరికాకు చెందిన పలు విమానాలను, సైనిక వాహనాలను ధ్వంసం చేశారు.  క్యాంప్ సింబాలో హెవీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారు ముందుకు చొచ్చుకురాగా.. వారిని అమెరికన్ సైనికులు వెనక్కి తరిమారు.  ఈ ఘటనలో నలుగురు అల్-షబాబ్ సభ్యులు  మరణించారు. అయితే తాము 17 మంది అమెరికన్లను హతమార్చామని,  తమ దాడిలో 9 మంది కెన్యా సైనికులు కూడా మృతి చెందారని ఈ గ్రూపు చెప్పుకుంది. కానీ అధికారవర్గాలు ఈ ప్రకటనను తోసిపుచ్చాయి.  2011 లో కెన్యా సోమాలియాలోకి తన సైనికులను పంపుతున్నప్పటి నుంచి అల్-షబాబ్ తరచూ క్రాస్ బోర్డర్ చేస్తూనే ఉంది. కెన్యాలో అమెరికా దళాల ఉనికిని ఈ సంస్థ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu