భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి 35 ఏళ్ళు.. సాయం కోసం నిరీక్షణ ఇంకెన్నాళ్లు ?

భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి 35 ఏళ్ళు.. సాయం కోసం నిరీక్షణ ఇంకెన్నాళ్లు ?

అది 1984 వ సంవత్సరం.. డిసెంబరు 2.. 3 అర్ధరాత్రి.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం ప్రజల హాహాకారాలతో మారు మోగింది. అక్కడి యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా లీకయిన విషవాయువు.. మీథైల్ ఐసో సైనేట్ గ్యాస్ ‘ బీభత్సాన్ని ‘ సృష్టించింది.ఆ కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుమారు 5 లక్షల మంది ఆ పాయిజనస్ గ్యాస్ ప్రభావానికి గురయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్ గా అన్-పాపులర్ అయిన ఆ ఘటనలో […]

Anil kumar poka

| Edited By: Srinu Perla

Dec 03, 2019 | 7:08 PM

అది 1984 వ సంవత్సరం.. డిసెంబరు 2.. 3 అర్ధరాత్రి.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరం ప్రజల హాహాకారాలతో మారు మోగింది. అక్కడి యూనియన్ కార్బయిడ్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా లీకయిన విషవాయువు.. మీథైల్ ఐసో సైనేట్ గ్యాస్ ‘ బీభత్సాన్ని ‘ సృష్టించింది.ఆ కర్మాగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుమారు 5 లక్షల మంది ఆ పాయిజనస్ గ్యాస్ ప్రభావానికి గురయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఇండస్ట్రియల్ డిజాస్టర్ గా అన్-పాపులర్ అయిన ఆ ఘటనలో వేలాదిమంది మృత్యు వాత పడగా, వందలాదిమంది వివిధ శారీరక రుగ్మతల బారిన పడ్డారు. బాధితుల్లో చాలామంది కంటి చూపు పోయి అంధులు కాగా.. అనేకమంది ఊపిరితిత్తుల వ్యాధులతో సతమతమయ్యారు.

అయితే ఈ నాటికీ బాధితులు సరైన వైద్య సహాయం గానీ, ఆర్ధిక సాయం గానీ అందక, సామాజిక పునరావాసానికీ నోచుకోక అల్లల్లాడుతున్నారు. వీరికి కొంతలో కొంతయినా సాయపడేందుకు కొన్ని ప్రభుత్వేతర సంస్థలు కృషి చేస్తున్నా అది చాలడంలేదు. సమాచార హక్కు చట్టం కింద లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. బాధితుల ఆర్ధిక సాయం, పునరావాసం కోసం కేంద్రం రూ. 104 కోట్లు కేటాయించగా .. ఇందులో సుమారు 18 కోట్లు అవినీతి అధికారులు, సిబ్బంది జేబుల్లోకి చేరిపోయాయి. ఇక 86 కోట్లు గత తొమ్మిదేళ్లుగా వినియోగం కాకుండా వృధాగా పడి ఉన్నాయట. తమ భర్తలను కోల్పోయిన 473 మంది వితంతువులకు నిధులు లేవన్న సాకుతో గత ఏడాది నుంచి నెలవారీ పింఛన్లు ఆపేశారట. వీళ్ళలో అనేకమంది ఆకలితో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. విషవాయు ప్రభావానికి గురైన తల్లులకు పుట్టిన శిశువుల్లో చాలామంది పోషకాహార లోపంతో సతమతమవుతుండగా.. మరికొందరు అంగ వైకల్యంతో జన్మిస్తున్నారు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ ‘ శాపగ్రస్తులకు ‘ ఊరట లభించేదెప్పుడు ? న్యాయం కలిగేదెన్నడు ?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu