కోళీకోడ్ విమాన ప్ర‌మాదం : ప్ర‌ధాన కార‌ణం అదేనా !

కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో జరిగిన ఘోర‌ విమాన ప్రమాదానికి ప్రధాన కార‌ణాల‌పై కాస్త క్లారిటీ వ‌చ్చింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో దర్యాప్తు చేపట్టింది.

కోళీకోడ్ విమాన ప్ర‌మాదం :  ప్ర‌ధాన కార‌ణం అదేనా !
Follow us

|

Updated on: Aug 09, 2020 | 6:13 PM

Kozhikode air india plane crash :కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో జరిగిన ఘోర‌ విమాన ప్రమాదానికి ప్రధాన కార‌ణాల‌పై కాస్త క్లారిటీ వ‌చ్చింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. విమానంలోని కాక్‌పీట్‌ వాయిస్‌ రికార్డర్‌, డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా రికార్డర్‌లను స్వాధీనం చేసుకుంది. వాటిని విశ్లేషించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే.. బొయింగ్‌ 373-800 విమానం రన్‌వేపై కాకుండా.. ట్యాక్సీవేపై దిగడమే ప్ర‌మాదానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంచ‌నాకి వ‌చ్చారు. ఓవర్‌షూటింగ్ , ఆక్వాప్లానింగ్ రెండు ప్ర‌ధాన కార‌ణాలుగా‌ భావిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం మొద‌ట‌ రన్‌వేకు ఒకవైపు నుంచి దిగేందుకు ఏటీఎస్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అక్కడ వ‌ర్ష‌పు నీరు ఎక్కువగా ఉండ‌టంతో.. పైలెట్‌ మళ్లీ విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లి, రెండు చక్కర్లు కొట్టారు. ఆ తర్వాత ఏటీఎస్ సిబ్బంది రన్‌వే రెండోవైపు నుంచి దిగాలని స‌మాచారం అందించారు. దీంతో రన్‌వేకు కిలోమీటరు దూరంలో ఉన్న ట్యాక్సీవేపై పైలట్‌ విమానాన్ని దించారని ఏఏఐ తన ప్రైమ‌రీ రిపోర్ట్‌లో గుర్తించింది. ఒక విమానం రన్‌వేపై ల్యాండ్ అయ్యాక‌ పైలెట్‌కు సూచించిన టెర్మినల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీవేపైకి విమానాన్ని తీసుకెళ‌తారు. విమానం కిందకు దిగేప్పుడు కొన్ని వందల టన్నుల వెయిట్ రన్‌వేపై పడుతుందని, దాన్ని ట్యాక్సీవే తట్టుకోలేక‌ విమాన ప్రమాదానికిగురై ఉంటుందని విమానాశ్రయ ఇంజనీర్లు కూడా అంచ‌నా వేస్తున్నారు.

Read More : నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..