సింగరేణి మాదిరి అభివృద్ధి.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!

తెలంగాణ కేబినేట్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పలు అంశాలపై మినిస్టర్స్‌తో చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీకి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై కూాడా మంత్రివర్గం చర్చించారు. ముఖ్యంగా కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం ప్రకటించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా.. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటామని ప్రకటించారు […]

సింగరేణి మాదిరి అభివృద్ధి.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..!
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Nov 28, 2019 | 9:29 PM

తెలంగాణ కేబినేట్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు వెల్లడించారు. పలు అంశాలపై మినిస్టర్స్‌తో చర్చించినట్టు కేసీఆర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీకి చెందిన 48,000 మంది కార్మికుల భవిష్యత్తుపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యంలోని విలువైన ఆస్తులను లీజుకు ఇవ్వడం, వాణిజ్య సముదాయాల అభివృద్ధి వంటి కీలకమైన అంశాలపై కూాడా మంత్రివర్గం చర్చించారు.

 • ముఖ్యంగా కేసీఆర్ ఆర్టీసీపై కీలక నిర్ణయం ప్రకటించారు
 • ఎలాంటి ఆంక్షలు లేకుండా.. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుంటామని ప్రకటించారు
 • అలాగే.. బస్ ఛార్జీలు కి.మీ 20 పైసల చొప్పున పెంచనున్నట్లు తెలిపారు
 • రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై కేబినెట్‌లో చర్చించామన్నారు
 • వర్షాలతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయన్నారు
 • రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.571 కోట్లు మంజూరు చేశారు
 • అలాగే ధాన్యం కొలుగోలుపై కూడా కేబినెట్‌లో చర్చించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
 • పటిష్ట కార్యాచరణ దిశగా చర్యలు చేపడతామన్నారు
 • నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం
 • మిషన్ కాకతీయ చెరువులు నింపుకున్నాం
 • గ్రాండ్ వాటర్ బ్రహ్మాండంగా పెరిగింది
 • పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను పక్కన పెట్టేస్తున్నాం
 • మూడు రకాల పంటలు తెలంగాణలో పండుతున్నాయి
 • వరి కొనుగోలుకు సమగ్ర పాలసీ తయారు చేయాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu