కేంద్రం ఐటీఐఆర్‌ ఇవ్వము అంటే అడిగే బీజేపీ నాయకుడు లేడు.. ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు..?

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం..

కేంద్రం ఐటీఐఆర్‌ ఇవ్వము అంటే అడిగే బీజేపీ నాయకుడు లేడు.. ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతున్నారు..?
Follow us

|

Updated on: Mar 05, 2021 | 3:38 PM

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల సమన్వయ కర్త, రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు పాల్గొన్నారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారని చెప్పారు. అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గొప్పతనాన్ని కేంద్ర మంత్రులే ప్రశంసించారని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాస్తవాలు గమనించాలి. వ్యక్తిగత విమర్శలు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పి ఓట్లు అడగండి అని డిమాండ్ చేశారు. తెలంగాణలో లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామని లెక్క చెప్పాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి వేలాది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వరంగ సంస్థలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ వారికి అమ్మేస్తే ఈ వర్గాలకు ఉద్యోగాలు రావని వేమలు ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు,ప్రాజెక్టులు, నిధులు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఇయ్యం అంటున్నారు. తెలంగాణకు ఏమీ ఇయ్యనన్న మీకు మరి ఓట్లు ఎందుకు వేయాలని వేముల ప్రశ్నించారు. నిరుద్యోగ పట్టభద్రులు,ఉద్యోగులు, టీచర్స్,మేధావులు ఆలోచన చేయాలని కోరారు. వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే మాటలకు మోస పోకండి. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతభత్యాలు ఎంతో చెప్పి ఓట్లు అడగాలని సవాల్‌ విసిరారు.

బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాలు ఎంత,ఉద్యోగ కల్పన ఎంత అనేది చెప్పి ఓట్లు అడగాలి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీ దేవి విద్యావేత్త, ఉద్యోగ,ఉపాధ్యాయ సమస్యలు తెలుసు…సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని అడిగే అవకాశం ఉంటుంది. పట్టభద్రులు ఆలోచన చేసి టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు ఈ ప్రాంత అభివృద్ధి ని పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్లు వేయించుకుని గెలిచి ఈ జిల్లాను పట్టించుకోలేదు. సమస్యలు పరిష్కారం కావాలంటే టీ ఆర్ ఎస్ అభ్యర్థి వాణీ దేవి ని గెలిపించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా.. ఒక్క రూపాయి నిధులు కూడా రామచందర్ రావు తీసుకురాలేక పోయారని విమర్శించారు. ఉద్యోగులది, ప్రభుత్వానిది పేగు బంధం….వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఏడాది కి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ ప్రజల్ని మోసం చేసింది. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్మేస్తుంది. లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. మహిళ అభ్యర్థి ,విద్యావేత్త,మాజీ ప్రధాని కూతురు అయిన వాణీ దేవి గారిని గెలిపించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,పట్టబద్రులు సమాజంలో భాగమే. సాగునీరు,తాగునీరు,విద్యుత్ ,పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. అనేక రంగాల్లో పట్టబద్రులు ఉన్నారు. వారంతా జరిగిన అభివృద్ధి గమనించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఇచ్చిన ఉద్యోగాలు, సాగునీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చారా? అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.

ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవ్వము అంటే బిజెపి వాళ్లకు సిగ్గు అనిపిస్తలేదా? అని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. లక్షలాది మందికి ఉపాధి కలిపించే ప్రాజెక్ట్ ను కేంద్రం ఇవ్వమని చెప్తే…అడిగే బీజేపీ నాయకులు లేరు. ఏం మొహం పెట్టుకుని బిజెపి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ రంగ సంస్థలు అన్ని ప్రైవేట్ పరం చేస్తే లక్షలాది మంది ఉపాధి పోతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వర్తించవు. ప్రభుత్వం లాభల్లోకి తీసుకురాలేక పోతే ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా లాభాల్లోకి తీసుకొస్తాడని ప్రశ్నించారు. ప్రైవేట్ వాళ్ళ దాయదక్షిణ్యాల మీద ప్రజలు బ్రతకాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read More:

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతుంది.. మేకిన్‌ ఇండియా అనగానే కంపెనీలు క్యూ కడతాయా..? -మంత్రి కేటీఆర్‌

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?