Professor Jayashankar : అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు

Professor Jayashankar అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సికి కేరాఫ్‌గా మారాయి ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు. టెంపుల్ భూమిలో సమాధి నిర్మిస్తున్నారంటూ..

Professor Jayashankar : అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు
Follow us

|

Updated on: Mar 04, 2021 | 2:28 PM

Professor Jayashankar అప్పుడు సమాధి.. ఇప్పుడు స్మృతివనం. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారాయి ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలు. టెంపుల్ భూమిలో సమాధి నిర్మిస్తున్నారంటూ.. అప్పుడు అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. జయశంకర్ స్మృతివనంలో ఆ లీడర్ల ఫొటోలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. హన్మకొండలో ఆచార్య జయశంకర్ స్మృతి వనంలో విగ్రహాల వివాదం మళ్లీ రాజుకుంటుంది. జయశంకర్ జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ నిర్మిస్తున్న శిల్పాల స్క్రీన్‌పై కేసీఆర్, కేటీఆర్ శిల్పాలను చెక్కడమే ఈ వివాదానికి కారణం. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి పక్కన కేసీఆర్ ఫొటోలు పెడతారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

బాలసముద్రం ఏకశిలా పార్కును జయశంకర్ స్మృతి వనంగా మార్చుతోంది తెలంంగాణ ప్రభుత్వం. ప్రత్యేక నిధులు కేటాయించి హట్టహాసంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పార్క్ నిర్మాణం పూర్తైంది. చెట్లు, పూలమొక్కలు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. జయశంకర్ కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆచార్యుడి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చిత్రపటాలతో నిర్మించిన ఈ శిల్పాల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. జయశంకర్ సార్ శిల్పాలతో పాటు కేసీఆర్, కేటీఆర్ శిల్పాల ఏర్పాటు ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించింది.

అమరవీరుల శిల్పాలు పెట్టకుండా కేసీఆర్, కేటీఆర్‌లో ఫొటోలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. శిల్పాలు పెట్టడమెంటని ప్రశ్నిస్తున్నారు. జయశంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం గౌరవం ఇస్తున్నా.. ఈ ఫొటోలు ఇక్కడ అవసరమా అని అంటున్నారు. ఇది బీజేపీ కార్యకర్తలు చేసే రాద్ధాంతం అని ఆరోపిస్తున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. కేసీఆర్.. లేకపోతే.. తెలంగాణ ఉద్యమం ఎక్కడ ఉందంటూ.. తమ వాయిస్ వినిపిస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించని కమలనాథులు.. అనవసరంగా వివాదం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, ఈ పార్క్ నిర్మాణం కోసం ప్రభుత్వం 3 కోట్ల పైచిలుకు నిధులను కేటాయించింది. మొదటిదశలో కోటి 70 లక్షల రూపాయలు మంజూరు చేసింది. గ్రేటర్‍ కార్పొరేషన్‍తో పాటు కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ పనుల పురోగతిని పర్యవేక్షిస్తోంది.

Read also : AP Municipal Elections, Nara Lokesh vs Vijayasai Reddy ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌లో కాక రేపుతున్న కార్పొరేషన్‌ ఎన్నికలు

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు