Mystery Disease: వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం.. ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు.. సాయంత్రానికి రిపోర్టులు

వికారాబాద్‌లోప్రబలిన వింతవ్యాధి ఇంకా అదుపులోకి రాలేదు. ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉండటంతో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫిట్స్ రావడం, వాంతులు, విరేచనాలు

Mystery Disease: వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం.. ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు.. సాయంత్రానికి రిపోర్టులు
Follow us

|

Updated on: Jan 10, 2021 | 1:33 PM

Vikarabad mystery disease: వికారాబాద్‌లోప్రబలిన వింతవ్యాధి ఇంకా అదుపులోకి రాలేదు. ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉండటంతో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫిట్స్ రావడం, వాంతులు, విరేచనాలు వంటి ఇబ్బందులతో ఇప్పటివరకు 120 మంది ఆస్పత్రిలో చేరగా..వారిలో 17 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. వింత వ్యాధిపై సాయంత్రానికి అధికారులకు నివేదిక అందనుంది.  రిపోర్ట్స్ వచ్చేవరకు ఏం చెప్పలేమని  వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ చెప్పారు.  కల్లు ప్రభావంతో ఇలా జరుగుతుందా లేదా అన్నది రిపోర్ట్స్‌ వచ్చాకే తేలుతుందని చెప్పారు.

బాధితులను ఎమ్మెల్యే పరామర్శించి.. అస్వస్థతకు గల కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ సూపరింటెంట్‌ డాక్టర్ యాదయ్య సైతం తుది నివేదిక అందాకే అస్వస్థతకు గల కారణాలు తెలుస్తాయని చెప్పారు. మరోవైపు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు పరిసర ప్రాంతాలలోని 14 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు.

Also Read:

Fake currency: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్ల కలకలం.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి