కంచి నుంచి కృష్ణ శిల, 11 రోజుల్లోనే తయారీ, తిరుపతి నుంచి సీతారామలక్ష్మణ విగ్రహాలు రామతీర్థంకు తరలింపు

విజయనగరం జిల్లా రామతీర్థంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలు సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో, తిరుమల తిరుపతి దేవస్థానం..

కంచి నుంచి కృష్ణ శిల, 11 రోజుల్లోనే తయారీ, తిరుపతి నుంచి సీతారామలక్ష్మణ విగ్రహాలు రామతీర్థంకు తరలింపు
Ramatheertham
Follow us

|

Updated on: Jan 22, 2021 | 3:58 PM

విజయనగరం జిల్లా రామతీర్థంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలు సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శిలాశిల్ప ఉత్పత్తి విభాగంలో ఈ విగ్రహాలను చెక్కారు శిల్పులు. స్థపతి మారుతీరావు ఆధ్వర్యంలో మూడు విగ్రహాలు తయారయ్యాయి. ఇటీవల రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించేందుకు రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలను యుద్ధప్రాతిపదికన తయారుచేసి వీటిని ఇవాళ రామతీర్థం తరలించారు. దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ ఆధ్వర్యంలో తిరుపతి నుంచి రామతీర్థంకు విగ్రహాల తరలింపు కార్యక్రమం జరిగింది. విగ్రహాల తయారీకి కంచి నుంచి కృష్ణ శిలను తెచ్చిన శిల్పులు 11 రోజుల్లోనే మూడు విగ్రహాలను సిద్ధం చేశారు. రాముడు విగ్రహం రెండున్నర అడుగులు, సీతా, లక్ష్మణ విగ్రహాలు రెండు అడుగుల ఎత్తున్నవి చెక్కారు. రామతీర్థం ఆలయంలో ధ్వంసమైన విగ్రహాల నమూనాతోనే విగ్రహాల తయారీ జరిగింది. కాగా, రామతీర్థం విగ్రహాల ధ్వంసం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు సృష్టిస్తోన్న తరుణంలో జగన్ సర్కారు హుటాహుటీన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విగ్రహాలను తయారు చేయించి ప్రతిష్టించేందుకు ఏర్పాట్లను చకచకా పూర్తి చేసింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..