డయానాలా మాట్లాడటం చేతకావడం లేదు ః క్రిస్టెన్‌ సీవార్ట్‌

ప్రిన్సెస్‌ డయానా బయోపిక్‌ రాబోతున్నది.. స్పెన్సర్‌ పేరుతో వస్తున్న ఆ హాలీవుడ్‌ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌లోకి వెళ్లబోతున్నది.. ఈ సినిమాలో డయానాగా క్రిస్టెన్‌ స్టీవార్ట్‌ నటిస్తున్నది.. చూడ్డానికి కాస్త డయానాలాగే ఉన్నా..

డయానాలా మాట్లాడటం చేతకావడం లేదు ః క్రిస్టెన్‌ సీవార్ట్‌
Balu

|

Oct 13, 2020 | 11:44 AM

ప్రిన్సెస్‌ డయానా బయోపిక్‌ రాబోతున్నది.. స్పెన్సర్‌ పేరుతో వస్తున్న ఆ హాలీవుడ్‌ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌లోకి వెళ్లబోతున్నది.. ఈ సినిమాలో డయానాగా క్రిస్టెన్‌ స్టీవార్ట్‌ నటిస్తున్నది.. చూడ్డానికి కాస్త డయానాలాగే ఉన్నా.. డయానా అంత అందమైతే లేదామెకు! నిజమే…! డయానాలా ఉండేవారు ఈ భూమ్మీద ఎవరుంటారు? ఆమెలాంటి అమ్మాయిని అన్వేషించడం కూడా దండగే! సరే.. రూపంలో అయితే కాస్త పోలికలు ఉన్నాయి.. కానీ ఉచ్ఛారణ మాటేమిటి? డయానాలా క్రిస్టెన్‌ స్టీవార్ట్‌ ఇంగ్లీషు మాట్లాడగలదా? ఇప్పుడీ భయం స్టీవార్ట్‌ను కూడా వెంటాడుతోంది.. అందుకే డయానాలా ఇంగ్లీషు మాట్లాడేందుకు చాలా సమయం వెచ్చిస్తోంది.. యూట్యూబులు గట్రాలు చూస్తూ డయానా స్పీచ్‌లు వింటోంది.. ప్రాక్టీసు చేస్తోంది.. అయినప్పటికీ డయానాలా తాను మాట్లాడగలనా అన్న అనుమానం స్టీవార్ట్‌కు కలుగుతూనే ఉంది.. డయానాలా మాట్లాడటం తన వల్ల కాదు బాబు అని నిర్మోహమాటంగా చెప్పేస్తోంది.. నోరు తిరగడం లేదట! అలాగని డయానాది గొప్ప ఇంగ్లీషు కాకపోయినా ఆమె స్వరం అలాంటిది! ఆమె మాట్లాడుతుంటే ఇంగ్లీషుకే ఓ అందం వస్తుంది.. మేకప్‌ జిమ్మిక్కులతో తనలో డయానా పోలికలు తీసుకురాగలరేమో కానీ ఆమె మాటకు పోలిక తేవడం కష్టమేనంటున్నారు స్టీవార్ట్‌.. డయానాలా నటిస్తున్నవారే డయానా పలుకునూ నటించగలరని దర్శకుడు పదే పదే చెబుతుంటారని, ఆయన తనపై బోలెడంత నమ్మకం పెట్టుకున్నారని చెబుతోంది స్టీవార్ట్‌.. బయోపిక్‌లో డయానా మొత్తం జీవితాన్ని చూపించడం లేదు.. కేవలం డయానా ప్రేమ, పెళ్లి వరకే ఉంటుంది.. ఆమె మరణాన్ని సినిమాలో చూపించడం లేదని స్పష్టం చేశారు దర్శకుడు పాబ్లో లారైన్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu