Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికేపనిలో గురూజీ.. ఆ ఇద్దరిలో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందో..

కొందరు ట్రెండ్ ని ఫాలో అవుతారు.. మరికొందరు సెంటిమెంట్ కి ప్రయారిటీ ఇస్తారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్టులోనూ వినిపిస్తోంది

  • Rajeev Rayala
  • Publish Date - 2:33 pm, Tue, 4 May 21
Trivikram Srinivas: మహేష్ సినిమాకోసం మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికేపనిలో గురూజీ.. ఆ ఇద్దరిలో ఎవరికీ ఛాన్స్ దక్కుతుందో..
Trivikram Srinivas

Trivikram Srinivas: కొందరు ట్రెండ్ ని ఫాలో అవుతారు.. మరికొందరు సెంటిమెంట్ కి ప్రయారిటీ ఇస్తారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇప్పుడు మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్టులోనూ వినిపిస్తోంది. మూవీ అనౌన్స్ మెంట్ తర్వాత రాబోయే మేజర్ అప్డేట్ గురించి అప్పుడే ఫిలిం సర్కిల్స్ హీటెక్కిపోయాయ్. అందరి మనసులో ఒకటే ప్రశ్న. తమన్ ఆర్ మణిశర్మ?  ఇద్దరిలో త్రివిక్రమ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు. అజ్ఞాతవాసి అనిరుధ్ ఖాతాలోకి వెళ్లినా ఆ తర్వాతొచ్చిన రెండు బ్లాక్ బస్టర్స్ కీ బ్యాక్ గ్రౌండ్ లో వున్నది ఆ తమనుడే. అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో… మ్యూజికల్లీ సూపర్ హిట్ అనిపించుకున్నవే. పాటలతో పాటు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆ రెండు సినిమాల్ని కొత్త కొత్త హైట్స్ కి తీసుకెళ్లాయి. అందుకే… మహేష్ తో చెయ్యబోయే హ్యాట్రిక్ మూవీ కోసం తమన్ నే పిక్ చేసుకోవాలన్నది త్రివిక్రమ్ ప్లానట.

హీరో మహేష్ బాబు ఆలోచన మాత్రం మరోలా ఉందా? తమన్ నుంచి దూకుడు, ఆగడు, బిజినెస్ మేన్ సినిమాలకు పవర్ ఫుల్ బీట్స్ తీసుకున్న ఘట్టమనేని హీరో కమర్షియల్ గా మిక్స్ డ్ రియాక్షన్స్ రాబట్టుకున్నారు. పైగా… ఇప్పటికే సర్కారువారి పాటల్ని తమన్ చేతిలోనే పెట్టేశారు సూపర్ స్టార్. ఇప్పుడు మళ్ళీ తమన్ తోనే జర్నీ అంటే ఆడియెన్స్ కి మొనాటనీ ఫీల్ వస్తుందేమో అని మహేష్ ఆలోచిస్తున్నారట. గతంలో గురూజీ కెప్టెన్సీలో చేసిన రెండు సినిమాలు ఖలేజా, అతడు… మణిశర్మ మ్యూజిక్ తో ఎడ్వాంటేజ్ పొందినవే. మహేష్ బాబు ఎవర్ గ్రీన్ ఫేవరిట్స్ జాబితాలో మణిశర్మ మార్క్ మ్యూజికల్ హిట్స్ చాలా వున్నాయి. ఇప్పటికీ మహేష్ ఫాన్స్ ని మెస్మరైజ్ చేసే గోల్డెన్ బీట్స్ చాలావరకు మణిశర్మవే. పైగా.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ పాపులారిటీ బాగా పెరిగింది. మెగాస్టార్ కూడా రిపీటెడ్ గా ఛాన్సులిస్తూ మణి మేజిక్ కే ఓటేస్తున్నారు. మరి.. మనం కూడా మణికే కబురు పెట్టేద్దామా అనేది మహేష్ వెర్షన్. గురూజీ మాత్రం బుట్టబొమ్మ మాయలోంచి బైటపడలేకపోతున్నారా? వీళ్లిద్దరి మధ్య ఆ గ్యాప్ క్లియర్ అయితే తప్ప.. మహేష్ 28త్ మూవీ నుంచి మ్యూజికల్ అప్డేట్ ని ఎక్స్ పెక్ట్ చేసే ఛాన్స్ లేదు మరి.

మరిన్ని ఇక్కడ చదవండి :

యాక్షన్ ఎంటర్టైనర్ మహేష్ సర్కారు వారి పాట… సినిమాలో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ ఉండనుందట ..

Janhvi Kapoor: ఎల్లోరా శిల్పంలా కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ… జాన్వీ కపూర్ అందాలకు కుర్రకారు ఫిదా..